వైరల్ అయిన అనుష్క ముద్దు వీడియో

0Anushka-sharma-kissing-videఅభిమానులు స్టార్ల కోసం చూడటం మామూలే అయితే కొన్నిన్ సార్లు స్టార్లు కూడా అభిమానులకే అభిమానులైపోతారు. అందులోనూ ఆ అభిమాని ముద్దొచ్చే చిన్నారి అయితే ఇంక ఎలా ఆగుతారు.? ‘స్వచ్ఛభారత్ అభియాన్’కు సంబంధించి ప్రచార సన్నివేశాల చిత్రీకరణ నిమిత్తం బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ ఇటీవల ఒక ప్రాంతానికి వెళ్లింది.

అనుష్కకు వీరాభిమాని అయిన ఓ చిన్నారికి ఈ విషయం తెలియడంతో షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లింది. అయితే, అనుష్కను కలిసేందుకు ఆ చిన్నారికి అనుమతి లభించలేదు. అయినప్పటికీ, దూరం నుంచి అనుష్కను చూస్తూ నిలబడి పోయింది. అయితే ఆ అమ్మాయి తనకోసం చూస్తున్న విషయం తెలుసుకున్న అనుష్క చిన్నారి ని దగ్గరకు పిలిపించుకుంది..

దీంతో ఆ చిన్నారి ఆనందంతో అనుష్కను చేరుకుంది. కాసేపు చిన్నారితో గడిపిన అనుష్క ఆ పాప సల్మాన్‌-అనుష్క జోడీగా నటించిన సుల్తాన్‌ సినిమాలోని ‘జగ్‌ ఘూమెయా’ పాట పాడి అనుష్కని మరింత ఆనందం లో ముంచెత్తింది . ముగ్ధురాలైన అనుష్క వెంటనే ఆ చిన్నారిని కౌగిలించుకుని బుగ్గపై ముద్దుపెట్టింది. మరీ అంత ఎక్సైటయితే ముద్దు పెట్టేస్తుందనే కాబోలు విరాట్ మరీ మరీ పక్కపక్కనే తిరుగుతూంటాడు. ఔనూ మరి సుల్తాన్ లో సల్మాన్ పాట పాడ లేదనేనా అంతగా లిప్ లాక్ చేయనంటే చేయనని భీష్మించుక్కూచుంది…