ఈవారం రెండు సినిమాలు

0moviesసినిమా పూర్త‌యినా, విడుద‌ల చేసుకోలేక చాలామంది నిర్మాత‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. విడుద‌ల‌కు నోచుకోని వంద‌లాది సినిమాలు ల్యాబుల్లో మునిగిపోయాయి. అందులో రెండింటికి ఈవారం మోక్షం వ‌చ్చింది. అవే.. బంగారు కోడిపెట్ట‌, యుద్ధం. న‌వ‌దీప్, స్వాతి జంట‌గా న‌టించిన చిత్రం బంగారు కోడిపెట్ట‌. ఇదో.. క్రైమ్ కామెడీ. బంగారునాణెల దొంగ‌త‌నం నేప‌థ్యంలో సాగుతుంది. స్వామి రారా త‌ర‌వాత స్వాతి న‌టించిన సినిమా ఒక‌టి విడుద‌ల కావ‌డం ఇదో తెలిసారి. అన్న‌ట్టు.. స్వామిరారా కూడా క్రైమ్ కామెడీనే. న‌వ‌దీప్ చాలా కాలం త‌ర‌వాత తెర‌పై మెర‌వ‌బోతున్నాడు. ఈ సినిమా అత‌ని కెరీర్‌ కి చాలా కీల‌కం. ఈవారం వ‌స్తున్న మ‌రో సినిమా యుద్ధం. నిజంగా ఈ సినిమా పేరుకు త‌గ్గ‌ట్టు విడుద‌ల కోసం యుద్దాలు చేసింది. త‌రుణ్‌, యామీ గౌత‌మ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో శ్రీ‌హ‌రి కీల‌క పాత్ర పోషించారు. త‌రుణ్‌కి ఎలాగూ మార్కెట్ లేదు. క‌నీసం శ్రీ‌హ‌రి కోస‌మైనా ఈ సినిమా చూస్తారేమోన‌ని నిర్మాత‌లు గంపెడు ఆశ‌లు పెట్టుకొన్నారు. మ‌రి ఈ రెండు సినిమాల భ‌విష్య‌త్తు ఏమిటో? ఇందులో ఏ సినిమాకి ప్రేక్ష‌కులు మార్కులేస్తారో చూడాలి.