తొలిప్రేమ రివ్యూ

0

toli-prema-movie-reviewనిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌

తారాగ‌ణం: వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, సుహాసిని, సప్న ప‌బ్బి, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది, విద్యుల్లేఖా రామన్ త‌దిత‌రులు

కూర్పు: న‌వీన్ నూలి

సంగీతం: ఎస్‌.త‌మ‌న్‌

ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌

నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి

మెగా కాంపౌండ్ హీరోనే అయినా వ‌రుణ్ తేజ్ త‌న కెరీర్ ప్రారంభం నుండి డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలో ‘కంచె’ సినిమాతో ప్రేక్ష‌కుల అభిమానంతో పాటు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు వ‌రుణ్ తేజ్‌. ఈ యువ క‌థానాయ‌కుడికి గ‌త ఏడాది ‘ఫిదా’ రూపంలో పెద్ద హిట్ వ‌చ్చింది. ఈ ఏడాది ‘తొలిప్రేమ‌’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు వ‌రుణ్‌. న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి సినిమాపై అంద‌రిలో కాస్త క్యూరియాసిటి పెరిగింది. అందుకు కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కెరీర్ బ్రేక్ మూవీ తొలిప్రేమ టైటిల్‌తో అబ్బాయి వ‌స్తుండ‌ట‌మే. అలాంటి టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన వ‌రుణ్ తేజ్‌కి ఈ ‘తొలిప్రేమ‌’ ఎలాంటి విజ‌యాన్నిచ్చిందో తెలుసుకుందాం.

క‌థ‌:

ఆదిత్య (వరుణ్ తేజ్‌) కాలేజ్ టాప‌ర్‌.. తాను క‌రెక్ట్‌గానే ఆలోచించి ఏ ప‌నైనా చేస్తాను. అందులో ఏ త‌ప్పు ఉండ‌ద‌నుకునే యువ‌కుడు. ఇలాంటి మ‌న‌స్థత్వం ఉన్న ఆదిత్య ఓ ట్రెయిన్ జ‌ర్నీలో వ‌ర్ష (రాశీ ఖ‌న్నా)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. తన ప్రేమ‌ను ఆమెకు దాచుకోకుండా చెప్పేస్తాడు. ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ కోసం ఒకే కాలేజ్‌లో జాయిన్ అవుతారు. ఆదిత్య ప్రేమ‌కు వ‌ర్ష గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది. అయితే ప‌రిస్థితుల కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోతారు. ఆరేళ్ల త‌ర్వాత ఒకే కంపెనీలో లండ‌న్‌లో ఇద్ద‌రూ క‌లుస్తారు. అప్పుడు వారి మాన‌సిక సంఘ‌ర్షణ ఏంటి? ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుసుకుంటారా? వీరి ప్రేమ ఏమౌతుంది? అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌:

ఫిదాలో ఎన్నారై యువ‌కుడిగా, ప‌రిణితితో కూడుకున్న పాత్ర‌లో క‌న‌ప‌డ్డ వ‌రుణ్ తేజ్ ఈ సినిమా ల‌వ‌ర్‌బోయ్ పాత్ర‌లో భిన్నంగా క‌న‌ప‌డ్డాడు. ప్రేమ‌, విడిపోవ‌డం అనే సంద‌ర్భాల్లో వ‌చ్చే బాధ‌ను.. వేరియేష‌న్స్‌ను త‌న క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. వ‌ర్ష పాత్ర‌లో రాశీ ఖ‌న్నా చ‌క్క‌గా చేసింది. పాత్ర కోసం స‌న్న‌బ‌డ‌టం.. కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌టం పెద్ద ప్ల‌స్ అనే చెప్పాలి. రాశి త‌న కెరీర్‌లోనే బెస్ట్ రోల్ చేసింది. త‌న హావ‌భావాలు, కారులోని రొమాంటిక్ సీన్ అన్నీ యూత్‌ను, సగటు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది. స‌ప్న ప‌బ్బి పాత్ర చిన్న‌దే అయినా ఉన్నంతలో మెప్పించింది. బ‌జ‌ర్‌ద‌స్త్‌ ఆది, సుహాసిని, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌తో మెప్పించారు.

ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి తొలి సినిమా ఇది. మంచి ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ. ప్రేమ క‌థ అంటే ప్రేమికులు క‌లుసుకోవ‌డం.. విడిపోవ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం అనే పాయింట్ కామ‌న్‌గానే ఉంటుంది. ఇలాంటి ప్రేమ‌ క‌థ‌ల్లో ఎమోష‌న్స్‌, ఫీల్ అనేది ముఖ్యం. ఈ సినిమాలో అవి మిస్ కాకుండా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. సినిమా ప్రారంభ‌మైన కాసేప‌టికే ప్రేక్ష‌కులు ఆ ఫీల్‌కి లోన‌వుతారు. ఫ‌స్టాఫ్ అంతా ఓ ఫీల్‌తో ర‌న్ అవుతుంది. అయితే సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం స‌న్నివేశాల‌ను లాగిన‌ట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ ఎఫెక్టివ్‌గా ఉండాల‌నిపించింది. సెకండాఫ్ నెరేష‌న్ ఫ్లాట్‌గా అనిపించింది. అయితే సెకండాఫ్‌లో ప్రేమ‌కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. వెంకీ అట్లూరి క‌థకు త‌మ‌న్ త‌న సంగీతం, నేప‌థ్య సంగీతంతో బ‌లాన్ని చేకూర్చాడు. జార్జ్ సి.విలియ‌మ్స్ ప్ర‌తి స‌న్నివేశాన్ని అందంగా తెర‌పై చూపించాడు.

బ‌లాలు:

– న‌టీనటులు

– సినిమాటోగ్ర‌ఫీ

– సంగీతం, నేప‌థ్య సంగీతం

– ఫ‌స్టాఫ్‌

– క్లైమాక్స్‌

బ‌ల‌హీన‌త‌లు:

– సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ లేదు

– కామెడీ పెద్ద‌గా లేక‌పోవ‌డం

చివ‌ర‌గా… రెండు భిన్న వ్య‌క్తిత్వాల ప్ర‌యాణం.. ‘తొలిప్రేమ‌’

నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌ తారాగ‌ణం: వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, సుహాసిని, సప్న ప‌బ్బి, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది, విద్యుల్లేఖా రామన్ త‌దిత‌రులు కూర్పు: న‌వీన్ నూలి సంగీతం: ఎస్‌.త‌మ‌న్‌ ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌ నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌ క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి మెగా కాంపౌండ్ హీరోనే అయినా వ‌రుణ్ తేజ్ త‌న కెరీర్ ప్రారంభం నుండి డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలో ‘కంచె’ సినిమాతో ప్రేక్ష‌కుల అభిమానంతో పాటు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు వ‌రుణ్ తేజ్‌. ఈ యువ క‌థానాయ‌కుడికి గ‌త ఏడాది ‘ఫిదా’ రూపంలో పెద్ద హిట్ వ‌చ్చింది. ఈ ఏడాది ‘తొలిప్రేమ‌’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు వ‌రుణ్‌. న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి సినిమాపై అంద‌రిలో కాస్త క్యూరియాసిటి పెరిగింది. అందుకు కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కెరీర్ బ్రేక్ మూవీ తొలిప్రేమ టైటిల్‌తో అబ్బాయి వ‌స్తుండ‌ట‌మే. అలాంటి టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన వ‌రుణ్ తేజ్‌కి ఈ ‘తొలిప్రేమ‌’ ఎలాంటి విజ‌యాన్నిచ్చిందో తెలుసుకుందాం. క‌థ‌: ఆదిత్య (వరుణ్ తేజ్‌) కాలేజ్ టాప‌ర్‌.. తాను క‌రెక్ట్‌గానే ఆలోచించి ఏ ప‌నైనా చేస్తాను. అందులో ఏ త‌ప్పు ఉండ‌ద‌నుకునే యువ‌కుడు. ఇలాంటి మ‌న‌స్థత్వం ఉన్న ఆదిత్య ఓ ట్రెయిన్ జ‌ర్నీలో వ‌ర్ష (రాశీ ఖ‌న్నా)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. తన ప్రేమ‌ను ఆమెకు దాచుకోకుండా చెప్పేస్తాడు. ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ కోసం ఒకే కాలేజ్‌లో జాయిన్ అవుతారు. ఆదిత్య ప్రేమ‌కు వ‌ర్ష గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది. అయితే ప‌రిస్థితుల కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోతారు. ఆరేళ్ల త‌ర్వాత ఒకే కంపెనీలో లండ‌న్‌లో ఇద్ద‌రూ క‌లుస్తారు. అప్పుడు వారి మాన‌సిక సంఘ‌ర్షణ ఏంటి? ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుసుకుంటారా? వీరి ప్రేమ ఏమౌతుంది? అనేదే క‌థ‌. విశ్లేష‌ణ‌: ఫిదాలో ఎన్నారై యువ‌కుడిగా, ప‌రిణితితో కూడుకున్న పాత్ర‌లో క‌న‌ప‌డ్డ వ‌రుణ్ తేజ్ ఈ సినిమా ల‌వ‌ర్‌బోయ్ పాత్ర‌లో భిన్నంగా క‌న‌ప‌డ్డాడు. ప్రేమ‌, విడిపోవ‌డం అనే సంద‌ర్భాల్లో వ‌చ్చే బాధ‌ను.. వేరియేష‌న్స్‌ను త‌న క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. వ‌ర్ష పాత్ర‌లో రాశీ ఖ‌న్నా చ‌క్క‌గా చేసింది. పాత్ర కోసం స‌న్న‌బ‌డ‌టం.. కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌టం పెద్ద ప్ల‌స్ అనే చెప్పాలి. రాశి త‌న కెరీర్‌లోనే బెస్ట్ రోల్ చేసింది. త‌న హావ‌భావాలు, కారులోని రొమాంటిక్ సీన్ అన్నీ యూత్‌ను, సగటు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది. స‌ప్న ప‌బ్బి పాత్ర చిన్న‌దే అయినా ఉన్నంతలో మెప్పించింది. బ‌జ‌ర్‌ద‌స్త్‌ ఆది, సుహాసిని, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌తో మెప్పించారు. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి తొలి సినిమా ఇది. మంచి ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ. ప్రేమ క‌థ అంటే ప్రేమికులు క‌లుసుకోవ‌డం.. విడిపోవ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం అనే పాయింట్ కామ‌న్‌గానే ఉంటుంది. ఇలాంటి ప్రేమ‌ క‌థ‌ల్లో ఎమోష‌న్స్‌, ఫీల్ అనేది ముఖ్యం. ఈ సినిమాలో అవి మిస్ కాకుండా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. సినిమా ప్రారంభ‌మైన కాసేప‌టికే ప్రేక్ష‌కులు ఆ ఫీల్‌కి లోన‌వుతారు. ఫ‌స్టాఫ్ అంతా ఓ ఫీల్‌తో ర‌న్ అవుతుంది. అయితే సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం స‌న్నివేశాల‌ను లాగిన‌ట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ ఎఫెక్టివ్‌గా ఉండాల‌నిపించింది. సెకండాఫ్ నెరేష‌న్ ఫ్లాట్‌గా అనిపించింది. అయితే సెకండాఫ్‌లో ప్రేమ‌కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. వెంకీ అట్లూరి క‌థకు త‌మ‌న్ త‌న సంగీతం, నేప‌థ్య సంగీతంతో బ‌లాన్ని చేకూర్చాడు. జార్జ్ సి.విలియ‌మ్స్ ప్ర‌తి స‌న్నివేశాన్ని అందంగా తెర‌పై చూపించాడు. బ‌లాలు: - న‌టీనటులు - సినిమాటోగ్ర‌ఫీ - సంగీతం, నేప‌థ్య సంగీతం - ఫ‌స్టాఫ్‌ - క్లైమాక్స్‌ బ‌ల‌హీన‌త‌లు: - సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ లేదు - కామెడీ పెద్ద‌గా లేక‌పోవ‌డం చివ‌ర‌గా... రెండు భిన్న వ్య‌క్తిత్వాల ప్ర‌యాణం.. ‘తొలిప్రేమ‌’

తొలిప్రేమ రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.5
నటీ నటుల ప్రతిభ - 3.75
సాంకేతికవిభాగం పనితీరు - 3.5
దర్శకత్వ ప్రతిభ - 3.5

3.3

తొలిప్రేమ రివ్యూ

తొలిప్రేమ రివ్యూ

User Rating: 3.28 ( 3 votes)
3