‘నోటా’కు ఆ రెండు అడ్డంకులు..

0

అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ.. ఆ సినిమాలో ఆయన చూపించిన అభినయం నభూతో నభవిష్యతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ తనలో గొప్ప నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. విజయ్ లోని ఈ నటనా కౌశలాన్ని పసిగట్టే తమిళనాడు నుంచి ఓపెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. అదే ‘నోటా’. తమిళ రాజకీయాలను టార్గెట్ చేసి తీస్తోన్న ఈ సినిమాలో నటించడానికి హేమాహేమీలైన తమిళ హీరోలు జంకారు. అందుకే తెలుగు స్టార్ హీరో విజయ్ ను తీసుకొచ్చి సినిమా పూర్తి చేస్తారు.

విజయ్ హీరోగా వస్తున్న ‘నోటా’ను తెలుగు – తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు. తమిళ దిగ్గజ నటులు సత్యరాజ్ – నాజర్ లు ఇందులో తమిళ ముఖ్యమంత్రుల పాత్రలు పోషించారట.. విజయ్ ఒక్కడే ఇందులో తెలుగు నటుడు. మిగతా నిర్మాత – దర్శకుడితో సహా అందరూ తమిళులే.. తమిళ రాజకీయాలను షేక్ చేసే ఈ కథ ఇప్పుడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుతం విజయ్ ‘నోటా’కు పోటీగా తమిళంలో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి విజయ్ సేతుపతి-త్రిష నటించిన ‘96’ మూవీ. ఈ సినిమా రెండు రోజుల ముందే ప్రివ్యూలు వేశారు. చూసిన వాళ్లు – రివ్యూ రైటర్లంతా బ్లాక్ బస్టర్ అని కితాబిచ్చేశారు. శుక్రవారం రాబోతున్న మరో మూవీ ‘రాక్షసన్’ తమిళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ లలో ఒకటిని తేల్చిపారేశారు. దీంతో ఈ రెండు సూపర్ హిట్ ల నడుమ విజయ్ ‘నోటా’వస్తోంది. బాగుంటే ఓకే.. ఏమాత్రం టాక్ తేడా వచ్చినా కానీ ఈ రెండు సినిమాల మధ్య కొట్టుకుపోవడం ఖాయమని అంటున్నారు. దీంతో నోటా విషయంలో విజయ్ లో కంగారు మొదలైంది. మరి ఈ శుక్రవారం ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే..
Please Read Disclaimer