ముగ్గురు హీరోలతో రాజమౌళి చిత్రం..!

0Rajamouli-New-Picబాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచే రాజమౌళి నెక్ట్స్ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది స్టార్ హీరోల పేర్లు తెర మీదకువచ్చాయి. అదే సమయంలో నాని లాంటి యువ కథానాయకులతో జక్కన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా రాజమౌళి తదుపరి చిత్రానికి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది.

బాహుబలితో జాతీయ స్థాయిలో మార్కెట్ సొంతం చేసుకున్న రాజమౌళి నెక్ట్స్ సినిమాతో ఆ హవా కంటిన్యూ చేసే ప్లాన్‌లో ఉన్నాడట. అందుకే మూడు భాషలకు చెందిన ముగ్గురు హీరోలతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్నదనే ఆ వార్త సారాంశం. తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ముగ్గురు స్టార్స్‌తో భారీ ప్రాజెక్ట్‌కు బాహుబలి దర్శకుడు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా షికారు చేస్తోంది. ఇంత వరకు రాజమౌళి నుంచి మాత్రం తన నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.