సమంత తల్లి అవ్వడం ఏంట్రా బాబు..!

0

ఈమద్య కాలంలో యూట్యూబ్ ఛానెల్స్ లో టైటిల్ కు న్యూస్ కు సంబంధం లేకుండా ఉంటుంది. లోపల న్యూస్ ఏదైనా బయట మాత్రం చాలా ఆసక్తికర టైటిల్ పెట్టాలనే ఉద్దేశ్యంతో పూర్తిగా మిస్ లీడ్ చేసే టైటిల్స్ ను పెడుతున్నారు. జనాలకు అవి ఇప్పటికే అలవాటు అయ్యాయి. టైటిల్ ను చూసి అబ్బో అని క్లిక్ చేయడం మానేశారు. అయినా కూడా ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వారు మిస్ లీడ్ టైటిల్స్ నే వాడుతున్నారు. తాజాగా నాగచైతన్య – సమంతకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో హల్ చల్ చేసింది. అదే వారిద్దరు కుక్కపిల్లను పెంచుకోవడం. ఆ వార్తను యూట్యూబ్ లో చిత్ర విచిత్రంగా ప్రజెంట్ చేశారు.

సమంత – నాగచైతన్యలు కుక్కపిల్లను పెంచుకుంటున్నారు అనే వార్తను ఒక్కో ఛానెల్ ఒక్కోరకంగా ప్రజెంట్ చేశాయి. కొందరు మాత్రం క్రియేటివిటీని ఉపయోగించి చైతూ – సామ్ లు తల్లిదండ్రులు అయ్యారంటూ టైటిల్స్ పెట్టేశారు. సమంత తల్లి అయ్యిందని సమంత – నాగచైతన్య ల ఇంట్లో కొత్త మెంబర్ అంటూ రకరకాల టైటిల్స్ తో ఇష్టం వచ్చినట్లుగా యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నారు. ఈ హెడ్డింగ్స్ చూస్తే కొన్ని సార్లు బాబోయ్ అనిపించక మానదు.

కుక్కపిల్లను పెంచుకుంటూ ఉంటే సమంత తల్లి అయ్యిందంటూ హెడ్డింగ్స్ పెట్టడం ఏంట్రా మీ మొహం అంటూ కొందరు సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ క్రియేటివిటీకి హద్దు పద్దు లేకుండా పోయింది. కొందరు మాత్రం సమంత నిజంగానే తల్లి అయ్యిందా ఏంటీ అనుకున్నారు. ఈ జంట ఎవరినైనా దత్తత తీసుకున్నారేమో లేదంటే మరేదైనా రకంగా తల్లి అయ్యిందేమో అనుకున్నారు. తీరా లింక్ ఓపెన్ చేస్తే అసలు విషయం తెలిసి చీ ఎంట్రా బాబు ఈ టైటిల్ అనుకుంటున్నారు. యూట్యూబ్ లో ఈ తరహా మిస్ లీడింగ్ టైటిల్స్ మరీ ఎక్కువ అవుతూనే ఉన్నాయి.
Please Read Disclaimer