2016లో సెలబ్రిటీస్ మ్యారేజెస్

02016-celebrations-marriages2016 సంవత్సరం చాలామంది సినిమావాళ్లను ఒక ఇంటివాళ్లను చేసింది. ముదురు బెండకాయల నుంచి లేత కుర్రాళ్ల వరకు చాలామంది వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు. ఇంకొంతమంతి కొత్త సంవత్సరంలో పెళ్లి చేసుకోవడానికి జోడీలను రెడీ చేసుకుని ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ కాకున్నా ఎంజాయ్ మెంట్లో ఉన్నారు.

తెలుగు హీరోల్లో సీనియర్ బ్యాచ్ లర్ జేడీ చక్రవర్తి 2016లో పెళ్లి చేసుకున్నారు. ఆయనతో పాటు దర్శకుడు క్రిష్, హీరో వరుణ్ సందేశ్ కూడా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

– జేడీ చక్రవర్తి, అనుకృతి:

రాంగోపాల్ వర్మ శివ సినిమాతో సినీ రంగంలోకి వచ్చిన జేడీ తన విలక్షణ నటనతో తనకంటూ ఒక అభిమాన వర్గాన్ని తయారుచేసుకున్నారు. చాలాకాలంగా ఆయన ప్రేమలో ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. అలాంటి రహస్య ప్రేమికురాలు అనుకృతి శర్మని ఆయన 2016లో పెళ్లి చేసుకున్నారు.

– డైరెక్టర్ క్రిష్, రమ్య:

గమ్యం వంటి సినిమాలతో హిట్లు కొట్టి ఇప్పుడు బాలకృష్ణ 100 సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణితో దుమ్ము రేపడానికి రెడీ అవుతున్న క్రిష్ ఆగస్టులో రమ్యను పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ పెళ్లికి సినీ ప్రముఖులంతా కదలివచ్చారు.

-వరుణ్ సందేశ్, వితిక:

నటుడు వరుణ్ సందేశ్ మరో నటి వితికను ఈ ఏడాది ఆగస్టులోనే పెళ్లి చేసుకున్నారు.

– డైరెక్టర్ విక్రమ్, శ్రీనిధి:

మనం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ వినయ్ కుమార్ సౌండ్ ఇంజినీర్ శ్రీనిధిని పెల్లి చేసుకున్నారు.