రాజకీయాల్లోకి వస్తున్ననిర్మాత దిల్‌ రాజు?

0Dil-Rajuప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత దిల్‌ రాజు టిఆర్ఎస్‌లోకి చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది..దిల్‌ రాజును తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వనించినట్టు సమాచారం.

నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నందున ఆమె సీటును దిల్ రాజును ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిార్ సిద్దంగా ఉన్నారని కూడ ప్రచారం సాగుతోంది.

పార్టీకి సినీ గ్లామర్‌ను తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగానే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకొని దిల్ రాజుకు ఆఫర్ ఇచ్చినట్టు టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

అయితే ఈ ఆఫర్‌పై దిల్ రాజు కూడ కొంత సానుకూలంగానే స్పందించారని సమాచారం.అన్నీ సక్రమంగా సాగితే 2019 ఎన్నికల్లో దిల్ రాజు టిఆర్ఎస్ తరపున నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసే అవకాశాలున్నాయని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ విషయమై దిల్ రాజు నుండి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఫిదా చిత్రం సభ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.