ఆమె డబ్బులు కూడా పోయాయ్

0టాలీవుడ్ లో ఒకప్పుడు ఆ దర్శకుడు అంటే అందరికి ఇష్టమే. ముఖ్యంగా హీరోలు అతను కథ చెప్పాడు అంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు. హీరో పాత్రను ట్రెండ్ సెట్ చేయడంలో ఆ దర్శకుడి తరువాతే ఎవరైనా. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో అతను సినిమా చేశాడు. కానీ గత కొంత కాలంగా ఆయన తీసిన ప్రతి సినిమా ఉహించని విధంగా డిజాస్టర్ అవుతుండడంతో ఆయన సక్సెస్ రేట్ తగ్గిపోయింది. డైలాగ్స్ తో ఆదరోగోట్టే డైరెక్టర్ టేస్ట్ ఇప్పుడు జనాలకు ఎక్కడం లేదు.

ఏ హీరో ఒప్పుకోకపోవడంతో తన తనయుడితోనే సినిమా చేసి హిట్ కొట్టాలని అనుకున్నాడు. ఆ ప్లాన్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. పైగా తన ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చి ఆ సినిమా కోసం ఖర్చు చేశారు. ఇప్పుడు క్రేజ్ తో పాటు ఆస్తులు కూడా పోయాయి. అయితే ఆ దర్శకుడితో పాటు మరో సీనియర్ హీరోయిన్ కూడా చాలా నష్టాలను చూసింది. ఆమె కో ప్రొడ్యూసర్ గా అతనితో చేతులు కలిపి దాదాపు 6 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు.

దాదాపు పదిహేనేళ్ల నుంచి చిన్న చిన్న పాత్రలు చేసి సంపాదించిన డబ్బు మొత్తం ఆ సినిమాతో పోవడంతో ఇప్పుడు ఆమె జీవితం ఉహించని స్థాయికి చేరుకుంది. పైగా దర్శకుడు ఆ నటి సీనియర్ నిర్మాత సహకారాన్ని తీసుకొని రిలీజ్ చేయించారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా నష్టపోతే కొంత డబ్బును వెనక్కి ఇవ్వాలని ఉండడంతో దర్శకుడు అప్పు చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా దర్శకుడు తన కొడుకుతో చేసిన ప్రయోగం కొంచెం కూడా లాభాన్ని ఇవ్వకపోగా తన దగ్గర ఉన్న ఆస్తులను కూడా పొగోట్టింది. మరి ఆ దర్శకుడు ఆ నటి ఎలా రికవర్ అవుతారో చూడాలి.