అందరివాడు బ్రాండ్ కోసం స్టార్ హీరోల తాపత్రయం

0

ఒకప్పుడు హీరోలు బయటకు వచ్చే వాళ్లు కాదు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందా – హిట్ అయ్యిందా – తర్వాతి సినిమా ఏంటి. ఇదే ధ్యాసలో ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోలు మారుతున్నారు. ఇతర హీరోలతో ఇగోలకు పోకుండా స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఒకరి ఆడియో ఫంక్షన్లకు మరొకరు ముఖ్య అతిథిగా వెళ్తున్నారు.

అఖిల్ తారక్ మంచి ఫ్రెండ్స్. దీంతో.. తన మిస్టర్ మజ్ను ఆడియో ఫంక్షన్ కు రమ్మిని ఎన్టీఆర్ ని ఆహ్వానించాడు అఖిల్. ఎన్టీఆర్ కూడా అఖిల్ అడగ్గానే వస్తానని చెప్పాడు. ఈ మధ్యకాలంలో ఇలా ఒకరి ఫంక్షన్లకు మరో హీరో అటెండ్ అవ్వడం చాలా కామన్ అయిపోయింది. విజయ్ దేవరకొండ ప్రతీ సినిమా ఫంక్షన్ కి అల్లు అర్జున్ వెళ్తాడు. మొన్న శర్వానంద్ పడి పడి లేచె మనసు సినిమా కార్యక్రమానికి బన్నీ వెళ్లాడు.

మహేశ్ – రామ్ చరణ్ మాత్రం ఫంక్షన్లకు రారు కానీ బయట మాత్రం రెగ్యులర్ గా కలుస్తుంటారు. మొన్న.. క్రిస్ మస్ సంబరాలకు మహేశ్ – ఎన్టీఆర్ – చరణ్ కుటుంబాలకు కలిసి కేక్ కట్ చేశాయి. ఇక సినిమా బావుంటే మహేశ్ బాబు తప్పకుండా ట్వీట్ చేస్తాడు. అలాగే చరణ్ కూడా సినిమా బావుందని టాక్ వస్తే తప్పక చూడండని ప్రమోట్ చేస్తాడు. ఇప్పుడు హీరోల మధ్య బాండింగ్ రోజురోజుకి పెరుగుతుంది. ఈ ట్రెండ్ హీరోల మధ్యే కాకుండా అభిమానుల మధ్య కూడా వస్తే ఇంకా బావుంటుంది.
Please Read Disclaimer