కుర్రాడికి పడిపోయిన స్టార్ హీరోయిన్?

0Heroineఆమె ఓ స్టార్ హీరోయిన్.. దశాబ్దానికి పైగా సినిమాల్లో కొనసాగుతోంది. అతడో కుర్ర హీరో.. చేతిలో సినిమాలు ఉన్నా ఇంకా కెరీర్ గాడిలో పెట్టుకోలేకపోయిన కుర్రాడు. సహజంగా సినిమాల్లో మినహాయిస్తే.. ఇలాంటి కాంబినేషన్ ఎక్కడా సెట్ కాదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తున్న హాట్ ఎఫైర్ ఇదే అంటున్నారు.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఆ స్టార్ హీరోయిన్.. ఈ మధ్యనే ఓ సీనియర్ హీరోతో భారీ సక్సెస్ కొట్టేసి.. ఫుల్లు ఫాంలోకి వచ్చేసింది. ఇదే సమయంలో తమిళం నుంచి కూడా క్రేజీ ఆఫర్స్ రావడంతో.. అమ్మడి టైమ్స్ మళ్లీ మొదలైనట్లే అంటున్నారు. కానీ ఈ కుర్రాడి పరిస్థితి వేరు. మొదట్లో వచ్చిన పేరును ఉపయోగించుకోలేక.. తెలుగులో హిట్ కొట్టలేకపోయి.. తమిళ్ లో ఓ విజయం సాధించి.. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరూ ఇప్పటివరకూ ఒక్క సినిమాలో కూడా కలిసి కనిపించలేదు కానీ.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం తెగ చక్కర్లు కొట్టేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఈ మధ్యనే కుర్రాడితో కలిసి ప్రైవేటుగా ఓ హాలీడే ట్రిప్ కూడా వేసిందట ఈ స్టార్ బ్యూటీ. పార్టీలు.. ఫంక్షన్స్ లో అడపా దడపా కలిసిన పరిచయం.. చివరకు చాలా దూరం వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ ఆఫ్ స్క్రీన్ కాంబోపై ఇండస్ట్రీలో రకరకాల కామెంట్స్ వినిపిస్తుంటే.. ఆ హీరోయిన్ తల్లి మాత్రం ఈ కుర్రాడితో తన కూతురు అడ్వాన్స్ అవుతుండడంపై తెగ బెంగ పెట్టేసుకుంటున్నట్లు తెలుస్తోంది.