టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్

0Dyavuda-director-arrestedటాలీవుడ్ యువ దర్శకుడు సాయిరాం అరెస్ట్ సంచలనం రేపింది. సాయిరాం తన మొదటి సినిమా ‘ద్యావుడా’ టీజర్ ను జనవరి 1న నూతన సంవత్సర సందర్బంగా విడుదల చేశారు. ఆ టీజర్లో హిందూ దైవం శివుడిపై అసభ్యకర రీతిలో సన్నివేశాలు చిత్రాకరించారు. వాటిని చూసిన కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు అవి భక్తుల మనో భావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని సాయిరాంను గతంలోనే హెచ్చరించారు. మళ్ళీ తాజాగా ఇదే విషయమై పోలీసులకు పిర్యాదు కూడా చేశారు.

దీంతో పోలీసులు సాయిరాంను అరెస్టు చేసి విచారించగా మన దేశంలోని కొన్ని దేవాలయాల్లో శివుడిని సిగరెట్లు, మద్యంతో పూజిస్తారని, వాటి స్ఫూర్తితోనే సినిమాలో ఆ సన్నివేశాల్ని చిత్రీకరించామని, ప్రస్తుతం వాటిని సినిమా నుండి తొలగించడం జరిగిందని, యూట్యూబ్ యాజమాన్యానికి కూడా ఆ సన్నివేశాల్ని తొలగించాలని విజ్ఞప్తి చేశామని తెలిపాడు. ఇకపోతే ఈ చిత్ర ప్రొడ్యూసర్ కడప జిల్లాకు చెందిన గజ్జెల హరికుమార్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.