క్యాసినోలో తగలేస్తున్న కుర్ర హీరో

0ఈ మధ్యన హీరోలకూ హీరోయిన్లకూ ఏదో ఒక వ్యసనం ఉండనే ఉంటోంది. కొంతమంది వరుసగా సినిమాలు చేయడానికి వ్యసనపరులు అయిపోతే.. కొంతమంది కొత్త రకం కథలకు వ్యసనం అయిపోయారు. అదంతా సినిమాల విషయం. బయటకొచ్చి కాస్త పర్సనల్ లైఫ్ లోకి తొంగిచూస్తే.. కొంతమంది హీరోహీరోయిన్లు.. మందు పేకాట అంటూ కాలం గడుపుతుంటే.. కొంతమంది కేవలం జిమ్ లకే పరిమితం అయిపోతున్నారు. అయితే ఒక హీరో మాత్రం కేరాఫ్ క్యాసినో అంటున్నాడు.

ఆ మధ్యన ఒకసారి ఒక తెలుగు సంఘం ఇన్విటేషన్ మేరకు అమెరికా వెళ్ళిన ఒక కుర్ర హీరో.. అక్కడ సరదాగా క్యాసినోకి వెళ్ళాడంట. ఒక చేతిలో మధ్యం..మరోచేతిలో డాలర్లు మార్చి తీసుకున్న కాయిన్స్.. వాటితో రౌలెట్ ఆడాడంట. దానితో ఇప్పుడు వీలు దొరికితే చాలు క్యాసినో ఆడేస్తున్నాడు. అయితే ఇండియలో గోవాలో నది మధ్యన ఉన్న క్యాసినో ఆడితే.. అక్కడ మనోళ్ళకు అడ్డంగా దొరికిపోయే ఛాన్సుంది కాబట్టి.. ఈ కుర్ర హీరో హాంకాంగ్ వెళ్ళి అక్కడ మకావ్ ఐల్యాండ్ లో క్యాసినో ఆడుతున్నాడు. ఇక బాగా వీలుపడితే మాత్రం లాస్ వేగస్ ట్రిప్పులు కొట్టేస్తున్నాడు అంటున్నారు.

నిజానికి మొదటిసారి తప్పిస్తే.. అసలు ఇప్పటివరకు ఇతనికి క్యాసినోలో రూపాయి కూడా రాలేదని టాక్ వినిపిస్తోంది. ఏదో కష్టపడి ఓ రెండు హిట్లు కొట్టాక రెమ్యూనరేషన్ పెరగ్గానే.. మనోడు ఇలా వచ్చిన సొమ్మంతా జూదానికి తగలేయడం అతని స్నేహితులకు కాని.. ఇంట్లోవారికి కాని నచ్చలేదు కాని.. మనోడు మాత్రం తన చేతిలాఘవాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నాడనమాట.