టాయ్‌లెట్‌‌లో ఆ ‘దృశ్యం’ చూసాడనే గొంతు కోసేశాడు..!

0Gurgaon-School-Boy-Pradyumnదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏడేళ్ల బాలుడు ప్రద్నుమ్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. గుర్‌గ్రామ్‌లోని రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ టాయ్‌లెట్‌లో ఇటీవల ప్రద్నుమ్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కొద్ది గంటలకే స్కూలు బస్సు కండక్టర్‌ అశోక్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు కండక్టర్ ఎందుకు పాల్పడాల్సి వచ్చిందనే విషయంపై ఇద్దరు పిల్లలు ఇచ్చిన వాంగ్మూలం పోలీసులను సైతం దిగ్భ్రాంతి పరిచింది. పోలీసు సమాచారం ప్రకారం, కారు కండక్టర్ టాయెలెట్‌లో ‘హస్తప్రయోగం’ చేసుకుంటుండగా ప్రద్నుమ్మ చూడటమే హత్యకు దారితీసిందట. సెకండ్ క్లాస్-బి స్టూడెంట్‌తో సహా మరో స్టూడెంట్ తమకు ఈ సమాచారమిచ్చినట్టు పోలీసులు తెలిపారు. ప్రద్నుమ్న హత్య జరగడానికి కొద్ది సెకన్ల ముందు టాయ్‌లెట్‌లో కుమార్‌ను తాము చూశామని ఆ ఇద్దరు విద్యార్థులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని ఆ ఇద్దరూ తర్వాత గుర్తుపట్టారు కూడా. కరాటే యూనిఫాం మార్చుకునేందుకే తాము టాయ్‌లెట్‌కు వెళ్లినట్టు ఆ విద్యార్థులు పోలీసులకు ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు. యూనిఫాం మార్చుకుని ఇద్దరు విద్యార్థులు బయటకు వెళ్లగానే ప్రద్నుమ్న లోపలకు వెళ్లాడని, అప్పుడు కండక్టర్ అశోక్ కు్మార్ ‘హస్తప్రయోగం’ చేసుకుంటుండగా చూసిన ప్రద్నుమ్న అవాక్కయ్యాడని, బయటకు పారిపాయే ప్రయత్నం చేస్తుండగా కండక్టర్ అతన్ని పట్టుకుని లైంగిక దాడికి, హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు, సాక్షుల వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు.