‘టచ్ చేసి చూడు’ ఫిబ్రవరి 2న రిలీజ్

0touch-chesi-chudu-release-dమాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున‍్న ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రీతమ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ముందుగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో సినిమా వాయిదా పడింది. తరువాత రవితేజ పుట్టిన రోజు కానుకగా జనవరి 26న రిలీజ్ చేస్తారని భావించినా.. హడావిడి అవుతుందన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 2న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రాజా ది గ్రేట్ తో సత్తా చాటిన రవితేజ టచ్ చేసి చూడుతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు.