మొదటి రోజు దువ్వాడ 30 తెస్తాడట

0


Allu-Arjun-DJ-Movie-First-Day-Collectionsఅల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాధం ఈ శుక్రవారమే థియేటర్లలోకి వచ్చేస్తోంది. డీజే రిలీజ్ కు ఇంకా 48 గంటల సమయం మాత్రమే ఉంది. వరుస సక్సెస్ లతో బన్నీ జోష్ మీద ఉండడం.. గబ్బర్ సింగ్ ఫేమ్ దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన మూవీ కావడం.. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన చిత్రం కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఈ మూవీ తొలి రోజు వసూళ్లపై కూడా ఎక్స్ పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రానికి భారీ మొత్తం దక్కనుందట. ఏపీ-తెలంగాణల నుంచి దువ్వాడ జగన్నాధం 16-18 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టే అవకాశాలున్నాయి ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు. కేరళలో బన్నీకి మార్కెట్ బాగా ఎక్కువ. అలాగే కర్నాటక నుంచి భారీ వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సోలో రిలీజ్ కావడంతో.. యూఎస్ మార్కెట్ నుంచి అనూహ్యమైన వసూళ్లు సాధించే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఎంటర్టెయినర్ జోనర్ కావడంతో.. యూఎస్ మార్కెట్ నుంచి భారీ కలెక్ష్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

మొత్తం మీద డీజే తొలి రోజు వసూళ్లు కనీసం 30 కోట్ల రూపాయల మార్కును దాటే ఛాన్స్ ఉందని అంచా వేస్తు్నారు ట్రేడ్ జనాలు. వీకెండ్ ముగిసేవరకూ ఈ జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తుండడంతో.. తొలి వారాంతానికి దువ్వాడ జగన్నాధం 50 కోట్ల మార్కుకు చేరుకునేందుకు అవకాశాలున్నాయి. అయితే ఈ అంచనాలన్నీ సినిమా కంటెంట్ ఎలా ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తొలిరోజు వసూళ్ళు భారీగానే ఉంటాయి కాని.. కంటెంట్ లో మ్యాటర్ లేకపోతే సెకండ్ డే నుండి పెద్ద సినిమాలకు పెద్ద దెబ్బే పడుతోంది. ఈ మధ్యన వచ్చిన బ్రహ్మోత్సవం.. కాటమరాయుడు అందుకు ఉదాహరణలు.