తల్లులైపోతున్న త్రిష అండ్ నయనతార

0


Trisha-and-Nayantharaనటీమణులపై మొదటి సినిమా ప్రభావం చాలానే ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఒక నటి ఎలా కనిపిస్తే ఆ తర్వాత సినిమాలలో కూడా అలానే కనిపించాలి అని ఇండస్ర్టీ వాళ్ళు జనాలూ కోరుకుంటారు. మొదటి సినిమాలో వదిన క్యారెక్టర్ వేస్తే తర్వాత చాలా సినిమాల్లో అదే పాత్ర చేయాల్సి వస్తుంది. తొలిసినిమాలో వాంప్ పాత్రలు వేస్తే ఇంకా అలా వాంప్ గానే కొనసాగవలిసి వచ్చేది. ఆ భయం తోనే చాలా మంది కొన్ని పాత్రలు చేయడానికి వెనకాడతారు.

కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేక్షకులు ప్రతి సినిమాలోనూ ఏదో కొత్తదనం వెతుకుతున్నారు. అందుకోసం వాళ్ళ అభిమాన నటీనటులు ఎలా కనిపించినా అంగీకారం తెలుపుతున్నారు. అందుకే పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా స్త్రీ పాత్ర ఆదారంగా తీస్తున్న సినిమాల్లో పిల్లల తల్లులుగా కూడా కనిపించేస్తున్నారు. మన సౌత్ టాప్ హీరోయిన్లు త్రిష నయనతార అలాంటి పాత్రలు చేయడానికి సిద్దపడ్డారు. త్రిష – నయనతారలు టాప్ హీరోయిన్లు గా ఉంటూనే తల్లి పాత్రలు చేయడానికి ఒప్పుకోవడం అంటే.. అంతేగా మరి. త్రిష – అరవిందస్వామి నటిస్తున్న చతురంగ వేట్టై–2 అనే తమిళ్ సినిమాలో త్రిష నాలుగు ఏళ్ళు పాపకు తల్లిగా చేయబోతుంది. అలాగే నయనతార నటిస్తున్న ఒక చిత్రం ఇమైకా నోడిగళ్ లో సీబీఐ అధికారిణిగా నాలుగేళ్ల పాపకు తల్లిగా కనిపించనుంది.

త్రిష నయనతార ఇద్దరు దశబ్ధం నుండి టాప్ హీరోయిన్ల గా ఇండస్ట్రిలో ఉంటున్న వారే. వయస్సు 30 దాటేసినా కూడా గ్లామర్ వీరికి సొంతం. కాని ఎన్నాళ్ళని గ్లామర్ మాత్రమే ఆరేసుకుంటూ పోతారు.. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి పాత్రలు చేస్తేనే మరి కొన్నాళ్లు ఇండస్ట్రిలో ఉండే ఛాన్స్ ఉంటుంది. అది గ్రహించే ఇలా పిల్లలకు తల్లులు అయిపోతున్నారు. అంతే కదూ.