త్రిష మాజీ ప్రియుడు మరో హీరోయిన్ తో ఎఫైర్

0Varun-Manian-Bindu-Madhaviవరుణ్ మణియన్.. కోలీవుడ్లో నిర్మాత అయిన ఈ వ్యక్తి గురించి మూడేళ్ల కిందటి వరకు తమిళ జనాలకు కూడా పెద్దగా తెలియదు. ఐతే త్రిషతో లవ్ ఎఫైర్ పుణ్యమా అని బాగా ఫేమస్ అయిపోయాడు. ముందు వరుణ్ జస్ట్ ఫ్రెండ్ అని చెప్పి.. ఆ తర్వాత అతడితో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది త్రిష. దెబ్బకు వరుణ్ పేరు మార్మోగిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయాడు వరుణ్. అతడి నేపథ్యం గురించి మీడియాలో చాలా వార్తలొచ్చాయి. కానీ త్రిషతో ఎంగేజ్మెంట్ రద్దయిపోవడంతో వరుణ్ మళ్లీ లైమ్ లైట్లో లేకుండా పోయాడు. ఇప్పుడు అతను మళ్లీ అనుకోకుండా వార్తల్లోకి వచ్చాడు.

త్రిషతో బ్రేకప్ అయ్యాక కొన్నాళ్లు సైలెంటుగా ఉండిపోయిన వరుణ్.. మళ్లీ ఇప్పుడు మరో హీరోయిన్ తో ఎఫైర్ మొదలుపెట్టాడని వార్తలొస్తుండటం గమనార్హం. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. తమిళ సినీ పరిశ్రమలో సెటిలైన తెలుగమ్మాయి బిందు మాధవి. వరుణ్-బిందు ఎఫైర్ గురించి వార్తలు ఊరికే పుట్టలేదు. వీళ్లిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్రిష లాంటి స్టార్ హీరోయిన్ ను మేనేజ్ చేయడం కష్టమనో ఏమో.. వరుణ్ తన రేంజికి తగ్గట్లుగా చిన్న రేంజి హీరోయిన్ తో సెటిలైపోదామనుకున్నట్లున్నాడు. బిందుమాధవికి కథానాయికగా పెద్దగా అవకాశాలేమీ లేవిప్పుడు. అందుకే ఇక లైఫ్ లో సెటిలైపోదామని చూస్తున్నట్లుంది. మరి వీరి బంధం ఎటువైపు సాగుతుందో చూద్దాం.