ఫారెస్ట్ లో ఒంటరిగా చెన్నై భామ

0Trisha-In-Gajarani-Movieచెన్నై భామ త్రిషా కృష్ణన్ ఇప్పుడు సూపర్ ఫాంలో ఉంది. యంగేజ్ లోను.. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు కూడా చేతిలో లేనన్ని సినిమాలను.. త్రిష లైన్ లో పెట్టేసింది. అసలు త్రిష కెరీర్ పూర్తయిపోయిందేమో అని అంతా అనుకున్న సమయంలో.. అస్సలు ఖాళీ లేకుండా షూటింగులు చేసేంత బిజీగా మారిపోయింది త్రిష.

థర్టీ ప్లస్ లోకి వచ్చి చాలా సంవత్సరాలే అయినా.. ఈ చెన్నై సుందరి చేతిలో దాదాపు డజన్ సినిమాలు ఉన్నాయి. ఎడా పెడా షూటింగులతో ఫుల్లు బిజీగా ఉన్న ఈ భామ.. గతేడాది కోడి చిత్రంలో నెగిటివ్ రోల్ తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఓ చిత్రం కోసం దట్టమైన అడవులలో షూటింగ్ చేస్తోంది త్రిష. ఈ సినిమా పేరు గజరాణి కాగా.. థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా రూపొందుతోంది. రోడ్ జర్నీ నేపథ్యంతో రూపొందే ఈ మూవీ కోసం.. త్రిష సింగిల్ గా హ్యాండిల్ చేయాల్సిన సీన్స్ చాలానే ఉంటాయట. పైగా టైటిల్ రోల్ కూడా పోషిస్తుండడంతో.. ఇది కూడా ఫిమేల్ సెంట్రిక్ మూవీనే అంటున్నారు.

ఇప్పటివరకూ త్రిష లీడ్ రోల్ పోషించిన సినిమా ఏదీ ఆశించిన స్థాయి విజయం సాధించలేదు కానీ.. ఈ తరహా ఆఫర్స్ మాత్రం ఈ చెన్నై బ్యూటీకి చాలానే వస్తున్నాయి. అయితే.. ఈ గజరాణి మాత్రం తన కెరీర్ లోనే ఒక టెక్నికల్ వండర్ అని తెగ చెప్పేస్తోంది త్రిష.