సమంత కోసమే త్రివిక్రమ్‌ అలా చేశాడా..??

0Trivikramఅందాలతార సమంతకు టాలీవుడ్‌లో పరిచయాలు బాగా పెరిగిపోయాయి. సమంతకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు మంచి స్నేహం ఉంది. ఈ స్నేహంతో త్రివిక్రమ్‌ మంచి చిత్రాల్లో సమంతనే హీరోయిన్‌గా ఎంపిక చేసుకుంటారు. తాజాగా త్రివిక్రమ్‌ చైతు చిత్రం ‘ప్రేమమ్‌’కు కొన్ని సన్నివేశాలను రచించాడు. ‘ప్రేమమ్‌’ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్న నాగార్జున కోసం మాటల మాంత్రికుడు కొన్ని డైలాగులను రాసినట్టు తెలుస్తోంది. అయితే ఈ డైలాగులు మాత్రం త్రివిక్రమ్‌ సమంత కోసమే రాశాడనే విషయం అర్థమవుతుంది.

సమంత, త్రివిక్రమ్‌ల మంచి స్నేహంలో సమంత తనకు కాబోయే మామగారికి సూట్‌ అయ్యే కొన్ని డైలాగులు రాయమని సమంత కోరగా త్రివిక్రమ్‌ అందుకు ఓకే చెప్పి డైలాగులను రాసినట్టు తొస్తోంది. ఈడైలాగులు ఈ చిత్రానికి హైలెట్‌గా మారుతాయని చిత్ర యూనిట్‌ వారు అంటున్నారు. నాగచైతన్య, సమంతలు జంటగా నటించిన ‘ప్రేమమ్‌’ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.