త్రివిక్రమ్ అలాంటి కథ తీస్తాడా ?

0trivikram-sociofantacyదర్శకుడు త్రివిక్రమ్- రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం లైన్ లో వున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్- అల్లు అర్జున్ చిత్రం తర్వాత ఈ చిత్రం సెట్స్ పై కి వెళ్లనుంది.

తాజాగా ఈ చిత్రంకు సంభందించిన ఓ ఆసక్తికరమైన అంశం నెట్ లో చెక్కెర్లు కొడుతోంది. ఈ చిత్రం కోసం  ఓ సోషియో ఫాంటసీ కథను త్రివిక్రమ్ రెడీ చేశారని, చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తరహ చిత్రమని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తను కొంతమంది కొట్టిపడేస్తున్నారు. ఎందుకంటే, త్రివిక్రమ్ కు ఓ స్టైల్ వుంది.

ఆయన రాసుకునే కథలన్నీ మన చుట్టూవున్న పాత్రలే. సోషియో ఫాంటసీ, గ్రాఫిక్స్ కు చోటు వుండదు. అందుకే  ఈ ఫాంటసీ వార్త అంత నమ్మబుల్ గా లేదనేది కొందరి వాదన. మరి, దీనిపై పూర్తి క్లారీటీ రావాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.