మహేష్ – గురూజీల కాంబో పట్టాలెక్కేది ఎప్పుడో?

0

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అందులో మొదటిది ‘అతడు’ కాగా రెండవది ‘ఖలేజా’. ఈ రెండు చిత్రాలు కూడా మహేష్ బాబు కెరీర్ లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అతడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా మహేష్ బాబులోని నటుడిని పూర్తి స్థాయిలో ఆ చిత్రంలో చూడవచ్చు. అద్బుతమైన నటనతో పాటు – మంచి టైమింగ్ తో మహేష్ బాబు నటించాడు. ఆ సమయంలో అతడు ఆడకపోయినా – ఆ తర్వాత బుల్లి తెరపై సెన్షేషనల్ విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఖలేజా చిత్రం వీరిద్దరి కాంబోలో వచ్చింది. మహేష్ బాబు కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. అయినా కూడా బుల్లి తెరపై ఖలేజా తో కూడా ఖలేజా చూపించాడు మహేష్బాబు.

ఖలేజా ఫ్లాప్ అయినా కూడా వీరిద్దరి కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత పదేళ్లుగా వీరిద్దరి కాంబో మూవీ గురించి మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా వీరిద్దరి కాంబోలో మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ లు తాజాగా ఒక యాడ్ షూట్ కోసం కలిశారు. ఆ సమయంలో ఇద్దరు చర్చించుకుని సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారనే విషయం కూడా తెల్సిందే. ఇక ఆ చిత్రం ఎప్పుడు అనే విషయమై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబో మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందట.

త్రివిక్రమ్ మరియు మహేష్ బాబులు వారివారి కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. అందువల్ల వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు కూడా వారిద్దరి మూవీ పట్టాలెక్కే అవకాశం లేదు. ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తున్న గురూజీ త్రివిక్రమ్ ఆ తర్వాత చిరంజీవితో సినిమా చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. కొరటాల మూవీ పూర్తి అయిన తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేసే అవకాశం ఉంది. మహేష్ కూడా వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. మహర్షి విడుదల తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ మూవీ ఉండవచ్చు అంటున్నారు.
Please Read Disclaimer