బయట పడిన త్రివిక్రమ్ వీక్నెస్

0మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలకు రాసే సంభాషణలు చాల వైవిధ్యభరితంగా ఉంటాయి. కేవలం ఆయన డైలాగుల కోసం వచ్చే రిపీటెడ్ ప్రేక్షకులు కూడ ఉన్నారు. అటువంటి త్రివిక్రమ్ కు అతడి రచనలకు సంబంధించి ఒక బలమైన బలహీనత ఉన్నట్లు టాక్.

ఎలాంటి భారీ సన్నివేశానికి అయినా బరువైన డైలాగులు వ్రాసే త్రివిక్రమ్ కు తన సినిమాలకు సంబంధించి టైటిల్ ఫిక్స్ చేసే విషయంలో తీవ్రమైన గందరగోళంలో ఉంటాడట. అంతేకాదు త్రివిక్రమ్ తన సినిమాలకు సంబంధించిన టైటిల్ ను ఫిక్స్ చేయడంలో తాను చాల వీక్ అని తన సన్నిహితులతో స్వయంగా త్రివిక్రమ్ నవ్వుతూ ఒప్పుకుంటాడు అని అంటారు.

ఈ బలహీనత వల్ల తాను ఆలోచించే టైటిల్ కు జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి త్రివిక్రమ్ తన మూవీ టైటిల్ ను తన టీమ్ చేత ముందుగా లీక్ చేయించి జనం అభిప్రాయం తెలుసుకుంటాడు అని అంటారు. ‘అత్తారింటికి దారేది’ నుండి ‘అజ్ఞాతవాసి’ వరకు త్రివిక్రమ్ ఈసినిమాల టైటిల్ కు సంబంధించి రకరకాల లీకులు ఇచ్చి జనం దృష్టిలో బాగా ఆమోదం పొందిన టైటిల్ ను తన సినిమాకు ఫిక్స్ చేసుకోవడం త్రివిక్రమ్ కు అలవాటు.