ఐష్ – ఆరాధ్య గురించి చిల్లర విమర్శలు

0

ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఆమె ఒక ఆడదే ఒక అమ్మే అనే విషయాన్ని జనాలు ఐశ్వర్య రాయ్ గురించి పదే పదే మర్చి పోతున్నట్లుగా అనిపిస్తుంది. ఐశ్వర్య రాయ్ గురించి ఆమె భర్త గురించి సోషల్ మీడియాలో పదే పదే ఏదో ఒక ట్రోలింగ్ ఈమద్య వస్తూనే ఉంది. మొన్నటి వరకు ఐష్ సంపాదనతో అభిషేక్ బచ్చన్ ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ఐశ్వర్య రాయ్ పై కొన్ని ట్రోల్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ చిల్లర కామెంట్స్ కు సెన్స్ లేని వారు చేస్తున్న విమర్శలకు ఐశ్వర్యరాయ్ పట్టించుకోవడం లేదు కాని సోషల్ మీడియాలో మాత్రం అవి వైరల్ అవుతున్నాయి.

ఇంతకు ఆ ట్రోల్స్ ఏంటీ అంటే.. తాజాగా ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆధ్యను వెంట బెట్టుకుని డిన్నర్ కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడున్నంత సమయం కూడా తన కూతురు ఆద్య కూతురు చేయి పట్టుకునే ఐశ్వర్య రాయ్ ఉంది. కారు దిగినప్పటి నుండి కూడా కూతురు చేయి పట్టుకుని తనతోనే ఐశ్వర్య ఉంచుకుంది. ఆ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటికి కొందరు ఐశ్వర్య తన కూతురు ఆద్యకు ఫ్రీడం ఇవ్వడం లేదని ఆద్య 8 ఏళ్ల వయసుకు వచ్చినా కూడా ఇంకా చిన్న పిల్ల మాదిరిగానే ట్రీట్ చేస్తుంది ఆ పాప ఎదగడం ఎలా అంటూ కొందరు ఆద్యపై ఎక్కడ లేని జాలి చూపిస్తూ ఐశ్వర్యరాయ్ పై విమర్శలు చేయడం జరిగింది.

సోషల్ మీడియాలో ఐష్ పై వస్తున్న విమర్శలు చాలా చిత్రంగా అనిపిస్తున్నాయి. ఒక తల్లి తన కూతురు జాగ్రత్త కోసం చేయి పట్టుకుంటే ఆమె ఎదుగుదలను అడ్డుకోవడం ఎలా అవుతుంది ఆమె స్వేచ్చను ఎలా హరించినట్లు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇలాంటి కుంచితపు గుణం ఉన్న నెటిజన్స్ వల్లే కొందరు సెలబ్రెటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ కొందరు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఐష్ తన కూతురు చేయి పట్టుకోవడం లో ఎలాంటి తప్పు లేదని ఎక్కువ శాతం మంది ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కొందరు మాత్రం చిల్లర విమర్శలు చేసి తమ చిల్లరతనంను బటయ పెడుతున్నారు.
Please Read Disclaimer