పోర్న్ స్టార్ తో ట్రంప్ రాసలీలలు రికార్డులు స్వాదీనం

0అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పోర్న్‌ స్టార్‌ స్టోర్మీ డేనియల్స్ తో లైంగిక సంబంధం ఉన్నట్లు అప్పట్లో ఓ కథనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. స్టోర్మీ డేనియల్స్ ప్రస్తుతం ఆయనపై న్యాయపోరాటానికి దిగింది. తనతో ట్రంప్ చేసుకున్న ఎగ్రీమెంట్ చట్టరిత్యాలేదని కోర్టుకు వెళ్ళింది స్టోర్మీ.

తాజాగా ఈ కేసులో ట్రంప్ న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాలపై ఎఫ్బీఐ సోదాలు జరుపుతోంది. స్వయంగా అధ్యక్షుడి లాయర్లపై దాడులు ప్రారంభం కావడం యూఎస్ లో కలకలం రేపగా, ఎఫ్బీఐ వైఖరిపై ట్రంప్ నిప్పులు చెరిగారు. ఇవి కుట్ర పూరిత చర్యని, ఎఫ్బీఐ దుర్మార్గంగా, అమెరికా మీద దాడిగా ఆయన అభివర్ణించారు ట్రంప్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్మీ డేనియల్స్ తో ట్రంప్ జరిపిన లావాదేవీల రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్టు అమెరికన్ వార్తా సంస్థలు బ్రేకింగ్ న్యూస్ లు వెల్లడిస్తున్నాయి. మరి ఈ కేసులో ట్రంప్ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటుందో చూడాలి.