‘టీఎస్ ఎంసెట్-2018’ నోటిఫికేషన్‌ విడుదల…

0‘టీఎస్ ఎంసెట్-2018’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది జేఎన్‌టీయూ. ప్రతి ఏడూలాగా కాకుండా ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో ఎంసెట్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 2 నుంచి 7 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించబోతున్నారు.

మే 2, 3 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు..
మే 4, 5, 7 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించబోతున్నారు.

ఉదయం10.00 గం. నుండి మ.1.00 గం. వరకు, మ.3.00 గం.- సా.6.00 గం. వరకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈసారి తెలుగు, ఇంగ్లిష్‌ భాషలతోపాటు ఉర్దూలోనూ ప్రశ్నపత్రం ఉండనుంది. పరీక్షల నిర్వహణకు తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలతోపాటు… ఏపీలోని కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణంలోనూ పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు.