ఈ నెల 11 నుండి బస్సులు బంద్..

0కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 11 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెలలో 7 నోటీసులు ఇచ్చామని , అయినాగానీ ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మికులు చెపుతున్నారు.

ఈ నెల 10న అర్ధరాత్రి నుంచే ప్రతి డిపో నుంచి బయలుదేరే మొదటి బస్సును నిలిపివేయడం ద్వారా సమ్మెను ప్రారంభించాలని తీర్మానించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని, రాష్ట్రంలోని 97 డిపోల్లో బస్సులను నిలిపివేస్తామని హెచ్చరించింది. 11లోపు మంత్రివర్గ ఉపసంఘం నుంచిగానీ, సీఎం కేసీఆర్‌ నుంచిగానీ ఏదైనా పిలుపు వస్తే చర్చలకు వెళతామని నేతలు ప్రకటించారు.