టీవీ నటుడి భార్య ఆత్మహత్య

0actor-manoj-goyals-wife-neeప్రముఖ టీవీ నటుడు మనోజ్‌ గోయల్‌ భార్య నీలిమా గోయల్‌ ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఆమె (40) ఊరేసుకొని ఆదివారం ఉదయం కనిపించిందని పోలీసులు తెలిపారు. సోనీ సబ్‌ టీవీ నటుడిగా పేరొందిన మనోజ్‌ పలు టీవీ సీరియళ్లలో నటించాడు. బంటీ ఔర్‌ బబ్లీ, బ్లాక్‌, కంపెనీ వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్నాడు. షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చిన మనోజ్‌ భార్య ఉరేసుకొని ఉండటాన్ని మొదట గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది.

నీలిమ ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆమె ట్యూషన్‌కు వెళ్లింది. సంఘటనా స్థలంలో ఆత్మహత్య లేఖను గుర్తించామని, తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని ఆమె లేఖలో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని, తాను సినిమా, టీవీ పరిశ్రమలో నిలదొక్కుకపోవడంతో తమ మధ్య విభేదాలు వచ్చాయని మనోజ్‌ తమకు తెలిపాడని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.