గూగుల్‌లో ఉద్యోగం వదిలివచ్చేశా..యాంకర్

0tv-anchor-lasya‘గుంటూరు టాకీస్’ సినిమా నిర్మాత కిషోర్, సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నట్టు టీవీ యాంకర్, సినీ నటి లాస్య చెప్పారు. శుక్రవారం భీమవరంలో నిర్వహించిన స్నేహ కిట్టి కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు వచ్చిన ఆమె విలేకరులతో ముచ్చటించారు. ఇంజినీరింగ్ చదువుతున్న తాను బుల్లితెరకు పరిచయమై ఐదేళ్లు అవుతుందన్నారు.

గూగుల్‌లో ఉద్యోగం చేస్తుండగా బుల్లితెరలో అవకాశం రావడంతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి నటిగా, యాంకర్‌గా స్థిరపడినట్టు తెలిపారు. తాను నటించిన అంకితం, డి జూనియర్స్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, సమ్‌థింగ్ స్పెషల్ వంటి కార్యక్రమాలు తనకెంతో గుర్తింపునిచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. యాంకర్స్‌లో ఉదయభాను అంటే తనకు ఇష్టమని లాస్య చెప్పారు.