యూజర్స్’కు ట్విట్టర్ హెచ్చరిక

0యూజర్స్ ని ట్విట్టర్ హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని 33కోట్ల మంది యూజర్స్ ని ట్విట్టర్ హెచ్చరించింది. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్విట్టర్ ఐఎన్సీ ఈ హెచ్చరికలు జారీ చేసింది.

తమ అంతర్గత కంప్యూటర్ సిస్టమ్స్ లో స్టోర్ అయిన టెక్ట్స్ మెసేజ్ లలో ఓ బగ్ ను కనుగొన్నామని ట్విట్టర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే దీన్ని తొలగించాం. ఈ బగ్ వల్ల ఎవరి పాస్ వర్డ్ లూ దొంగిలించబడినట్టు తేలలేదు. ఐతే, ముందు జాగ్రత్త చర్యగానే పాస్ వర్డ్ లు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నట్టు పేర్కొన్నారు.