తమన్నా.. అది నిజమేనా..?

0tamanna_2నటి తమన్నా పై ఆసక్తికరమైన ఆరోపణ చేశాడు నిర్మాత త్యాగరాజన్. ఒకప్పుడు విలన్ వేషాలకు పెట్టింది పేరైన త్యాగరాజన్ నిర్మాత అని, తమిళ హీరో ప్రశాంత్ కు తండ్రి అని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. నిర్మాతగా పలు సినిమాలను రూపొందించిన ఇఫ్పుడు తమన్నాపై ఒక ఆరోపణ చేశాడు. తన సినిమా ఆగిపోవడానికి కారణం తమన్నానే అనేది త్యాగరాజన్ ఆరోపణ.

ఈయన హిందీ సూపర్ హిట్ క్వీన్ సినిమా రీమేక్ హక్కులను కొనడం.. ఆ సినిమాను దక్షిణాది భాషల్లో రూపొందించడానికి ప్రయత్నం చేయడం తెలిసిన సంగతే. హిందీ వెర్షన్ ను సౌత్ లో రూపొందించడానికి ప్రధాన పాత్రధారిణిగా నటి తమన్నాను ఎంచుకున్నాడు త్యాగరాజన్. అనేక ప్రకటన అనంతరం ఈ సినిమా సౌత్ వెర్షన్ ఆరంభం అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. అంతలోనే ఆ సినిమాను రూపకల్పన ఆగిపోయినట్టుగా కూడా ప్రకటించారు.

మరి కథేంటి… అంటే తమన్నా వైపు వేలు చూపుతున్నాడు త్యాగరాజన్. ఆమె వల్లనే సినిమా ఆగిపోయిందంటున్నాడు. తమన్నా భారీ పారితోషకాన్ని అడిగిందని.. దీంతో సినిమా ముందుకు వెళ్లేలా లేదని ఈ నిర్మాత ప్రకటించాడు. మరి నటీనటుల పారితోషకం విషయంలో ఏదైనా సినిమా ఆగిపోయిందంటే.. అది వారికి చాలా చెడ్డ పేరు. మరి ఇప్పుడు తమన్నా కూడా అలాంటి పేరునే తెచ్చుకుంటోంది. మరి దీనిపై ఆమె ఏమంటుందో.. త్యాగరాజన్ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతుందో!