#మీటూ: సుభాష్ ఘాయ్ పై రేప్ ఆరోపణలు

0

#మీటూ కాంపెయిన్ మెల్లగా ఉధృత రూపం దాలుస్తోంది. ఇప్పటికే పలువురు మహిళలు సెలెబ్రిటీల పేర్లను బయట పెడుతూ వారు తమను లైంగికంగా వేధించారని ఆరోపణలనుచేసూ సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఒక మహిళ బాలీవుడ్ ఫిలిం మేకర్ సుభాష్ ఘాయ్ పై అత్యాచార ఆరోపణలు చేసింది.

తన పేరు వెల్లడించని ఆ మహిళ స్క్రిప్ట్ డిస్కషన్ కోసమని సుభాష్ ఘాయ్ తనను ఆఫీస్ కు రెగ్యులర్ గా పిలిచే వాడని ఆ సమయంలో తనతో తప్పుగా ప్రవర్తించేవాడని ఆరోపించింది. అప్పట్లో తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక పోవడంతో ఆ జాబ్ చేయడం తనకు ఎంతో ముఖ్యమని తెలిపింది. ఒకరోజు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి తనను అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఎవరికైనా ఈ విషయం చెప్తే జీతం ఇవ్వనని బెదిరించడంతో ఈ విషయాన్ని ఎవరికీ వెల్లడించలేదని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలపై స్పందించిన సుభాష్ ఘాయ్ ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని.. కోర్టుకు వెళ్లి వాటిని నిరూపించాలని లేదంటే ఆమెపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

‘ఖల్ నాయక్’.. ‘పర్దేస్’.. ‘తాల్’ లాంటి ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సుభాయ్ ఘాయ్ కి బాలీవుడ్ లో బ్రిలియంట్ ఫిలింమేకర్లలో ఒకరిగా గుర్తింపు ఉంది. మరి ఈ అత్యాచారం ఆరోపణల ఎపిసోడ్ తన ఇమేజ్ ని దెబ్బతీసేదే. ఇక ఈ హంగామా ఇంతటితో ఆగుతుందా లేదా కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాలి.