కవలలతో ఉదయభాను ఫస్ట్ లుక్

0Udaybhanu-Spotted-at-Zee-Telugu-Apsara-Awards-with-Her-Twin-Babiesయాంకర్ కం యాక్టర్ ఉదయభాను కొంతకాలంగా బ్రేక్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీ.. ఆ తర్వాత కవల పిల్లలు పుట్టడం.. వారి పెంపకం.. ఆరోగ్యంపై జాగ్రత్తలు.. ఈ కారణాలతో ఆమె దాదాపు రెండేళ్లుగా తెరపై కనిపించడం లేదు. ఒకట్రెండు సార్లు మాత్రం ఇంటర్వ్యూల ద్వారా తన ప్రెగ్నెన్సీ.. పిల్లల గురించి చెప్పిందంతే.

కానీ ఇప్పుడు మొదటిసారిగా తన ఇద్దరు పిల్లలను ప్రపంచానికి చూపిస్తూ.. ఫోటోలకు పోజులు ఇచ్చింది. తాజాగా జరిగిన జీ సినిమాలు అవార్డ్స్ 2017కు హాజరైన ఉదయభాను.. మొత్తం కుటుంబంతో ఈ కార్యక్రమానికి వచ్చింది. కన్ స్ట్రక్షన్ వ్యాపారి అయిన భర్త విజయ్.. ఇద్దరు కవల ఆడపిల్లలను కూడా తీసుకు రావడం విశేషం. భార్యాభర్తలు ఇద్దరూ చెరో చిన్నారిని ఎత్తుకుని ఫోటోకు పోజ్ ఇచ్చారు. కవలలు కావడంతో ఇద్దరూ దాపు ఒకేలా ఉండగా.. ఇద్దరు బుడతలకు ఒకే రంగులో ఒకే విధంగా డిజైన్ చేసిన డ్రెస్ వేయడం విశేషం.

తను కూడా అదే రంగులో చీర కట్టుకుని వచ్చిన ఉదయభాను.. తాను తన పిల్లలు ఒకటే ఆత్మ అని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది. ఒకటీ అరా ఆర్నమెంట్స్ తప్ప పెద్ద హంగామాగా కూడా రాలేదు ఉదయభాను. ఈ చిన్నారులకు కొంత వయసు వచ్చేవరకూ వారి ఆలనాపాలనా తానే చూడాలన్నది ఉదయభాను ఉద్దేశ్యం. ఆ తర్వాత మళ్లీ కెరీర్ కొనసాగించే ఆలోచన చేస్తానని చెబుతోంది ఈ స్టార్ యాంకర్.