సన్నీ లా చేస్తే స్వెటింగ్ ఖాయం!

0ఈమధ్య కాలం లో చాలామంది సెలబ్రిటీలు మంచి ఫిట్నెస్ ను మెయిన్ టైన్ చెయ్యడమే కాకుండా సాధారణ ప్రజలకు హెల్త్ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒంటి తీరు అని.. జీన్స్ అని పిచ్చ లాజిక్ లు చాలామంది చెప్తుంటారు కానీ ఫిట్నెస్ మెయిన్టైన్ చెయ్యాలంటే వ్యాయమం తప్పని సరి. అది జిమ్ కెళ్ళి చేసేదైనా కావచ్చు లేదా స్విమ్మింగ్ లాంటిది కావచ్చు లేదా స్పోర్ట్స్ లో పాల్గొనడం కావచ్చు.. ఇవేవీ లేకుండా ఊరకే తిని కూర్చుంటూ పర్ ఫెక్ట్ వెయిట్ ను ఎవరైనా మైంటైన్ చేస్తున్నారని చెప్తే వాళ్ళకు వెంటనే మనం ఒక దణ్ణం పెట్టచ్చు.

కానీ సేమ్ వెయిట్ కొనసాగించడం వేరు ఫిట్ గా ఉండడం వేరు. భారతీయుల కలల సుందరి సన్నీ లియోన్(అది గూగుల్ చెప్పిన విషయమే!) ఫిట్నెస్ చూస్తె ఎవరకైనా కుళ్ళు కలగక మానదు. ఆమె గతం.. భవిష్యత్తు లాంటి పిచ్చి టాపిక్ లు పక్కన బెడితే ఆమె ఎప్పుడూ ఒక ఫిట్నెస్ ఫ్రీక్. డైలీ కసరత్తులు చేయకుండా అసలు నిద్రపోదు. అందుకే ఆమె అలాంటి పర్ ఫెక్ట్ షేప్ లో ఉండగలుగుతోంది. రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఒక ఎక్సర్ సైజులు చేస్తున్న వీడియో ను పోస్ట్ చేసింది. స్పీడ్ మోషన్ లో(స్లో మోషన్ కు ఆపోజిట్ అదే కదా) దాదాపు పది రకాల కసరత్తులను అవలీలగా చేసి అవతల పారేసింది సన్నీ.

30 నిముషాల ట్రెడ్ మిల్ తర్వాత 35 నిముషాల సేపు జిలియన్ మైఖేల్స్ సూచించిన కార్డియో ఎక్సర్ సైజులను ఐ ఫోన్ లో వీడియో చూస్తూ చేశానని.. దూల తీరిపోయిందని కానీ ఇంకా బెటర్ గా చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తనకు సరైన ఛాలెంజ్ ఇచ్చినందుకు జిలియన్ కు కృతజ్ఞతలు చెప్పింది. వీడియో చూడండి.. పొరపాటున వెర్రి ఉత్సాహం తో చేసేరు.. నెక్స్ట్ డే కాపడం పెట్టుకునేందుకు వేడి నీళ్ళు – చిన్న బట్ట అవసరం అవుతాయి. మోడరన్ మహానుభావులకు మాత్రం బ్రూఫిన్ 600 ఒకటి తగిలించాల్సి ఉంటుంది.