నమ్రతకు ఉపాసన ఛాలెంజ్

0సోషల్ మీడియా అనేది కనిపిస్తే చాలు ఛాలెంజ్ వేసుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపొయింది. ఒకప్పుడు దమ్ముంటే నాలా చెయ్ అని విసురుకునే ఛాలెంజ్ లు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. పంతం కోసం కాకుండా మంచి కార్యక్రమం కోసం సెలబ్రెటీలు ఛాలెంజ్ లు విసరడం ట్రేండింగ్ అవుతోంది. గత కొంత కాలంగా బాలీవుడ్ కంటే టాలీవుడ్ తారలే ఎక్కువ ఛాలెంజ్ లు విసిరారని చెప్పాలి.

కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఇటీవల ఫిట్ నెస్ పై దేశంలో అవగాహనా కల్పించేందుకు ‘హమ్ ఫిట్తో ఇండియా ఫిట్’ పేరుతో కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్నటి వరకు టాలీవుడ్ హీరోలే అనుకుంటే ఇప్పుడు వారి సతీమణులు కూడా ఛాలెంజ్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మొదట సమంత ఫిట్ నెస్ వర్కౌట్ చేసి తన స్నేహితురాలైనా ఉపాసన రామ్ చరణ్ కు ఛాలెంజ్ విసిరారు.

అయితే ఉపాసన సమంత విసిరినా ఛాలెంజ్ ను స్వీకరించి మంచి పోటీని ఇచ్చింది. స్ట్రాంగ్ వర్కౌట్స్ చేసి తాను తక్కువ కాదు అన్నట్లు స్వీట్ కౌంటర్ ఇచ్చేసింది. అదే విధంగా నమ్రతకు కూడా ఆమె ఛాలెంజ్ విసిరారు. ఇప్పటికే దర్శకులు హీరోలు ఛాలెంజ్ లతో చాలా బిజీ అవుతున్నారు. ఇటీవల తారక్ ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే.