అఖిల్-శ్రేయా భోపాల్ మధ్య ఉపాసన!

0Upasana-Helps-To-Akhil-And-Shreyaఅక్కినేని అఖిల్-శ్రేయా భోపాల్ పెళ్లి క్యాన్సిల్ వార్త టాలీవుడ్‌తో పాటు అన్ని ఉడ్‌లలోనూ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇద్దరూ పాపులర్ సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వారు కావడంతో వీరి పెళ్లిపై మొదట్నించి క్యూరియాసిటి ఉంది. దీనికి తోడు వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరగడంతోపాటు పెళ్లి కూడా అంతకు మించిన రీతిలో జరుగుతుందని అందరూ ఎదురుచూశారు. కాని ఎవరూ ఉహించని ట్విస్ట్ ఇచ్చారు ఈ యంగ్ జోడి.

అఖిల్-శ్రేయా భోపాల్ మధ్య ఎంగేజ్మెంట్ తరువాత భేదాభిప్రాయాలు రావడంతో పెళ్లికి ముందే విడిపోవాలనే అభిప్రాయానికి వచ్చారని.. దీనికి ఇరుకుటుంబ సభ్యులు సమ్మతించడంతో దాదాపు ఈ జంట విడిపోవడం ఖాయం అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వీటిపై రెండు ఫ్యామిలీస్ ఖండించే ప్రయత్నం చేయకపోవడంతో అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ వార్తలో నిజం లేకపోలేదనే అభిప్రాయానికి వచ్చారు టాలీవుడ్ జనాలు.

ఇదిలాఉంటే వీరి మ్యారేజ్ క్యాన్సిల్‌లో కొత్త ట్వస్ట్ ఏంటంటే.. అఖిల్-శ్రేయా భోపాల్ పెళ్లి ఆగిపోకుండా ఎలాగైనా వారిమధ్య రాజీ కుదిర్చి పెళ్లి పీటలు ఎక్కించడానికి రాంచరణ్ భార్య ఉపాసన రంగంలోకి దిగిందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్.

చిరంజీవి, నాగార్జున కుటుంబాలు పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్‌ని చర్చించుకునేంత చనువు ఉండటం.. చరణ్ భార్య ఉపాసనకు జీవీకే కుటుంబానికి రిలేషన్ ఉండటంతో పాటు శ్రేయా భోపాల్ ఉపాసనకు బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఇరుకుంటుంబాలతో పెళ్లి రాయబారానికి రంగంలోకి దిగిందట ఈ మెగా కోడలు. ఉపాసన రాయభారం ఫలించి ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరి.. ఈ గాసిప్స్‌కు ఫుల్ స్టాఫ్ పడాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ ఉపాసన.