ఫ్యాషన్ రాజధానిలో స్టైలిష్ గా ఉపాసన

0

మెగా వదినమ్మ ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ జస్ట్ ఫేస్ బుక్ లో మాత్రమే యాక్టివ్ గా ఉంటే ఉపాసన మాత్రం ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్స్ లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు తరచూ అప్డేట్స్ అందజేస్తుంటారు. తాజాగా ఉపాసన తన ఫ్రాన్స్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను విశేషాలను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పారిస్ లో చిల్ అవుట్ చేస్తూ ఉన్న ఫోటోలను ఉపాసన పోస్ట్ చేశారు. ఒక ఫోటోకు “ఇషా అనిల్ వీ రెడ్డి.. హ్యాపీ బర్త్ డే. ఇక ఫన్ డబల్ అవుతుంది. నువ్వు మా ఫ్యామిలీలో ఉండడం ఎంతో ఫన్. లవ్ యు” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో కలర్ ఫుల్ దుస్తులలో స్టైలిష్ గా పోజిచ్చారు. మరో ఫోటోకు “డైనాస్టీ” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో ఉపాసన మరో ఆరుమంది తో పోజిచ్చారు. ఈ ఫోటోలో శ్రియా భూపాల్ కూడా ఉన్నారు. ఈ ఫోటోలకు ఫ్రెంచ్ డైరీస్ అంటూ హ్యాష్ టాగ్ జోడించారు.

ఇలా ఫ్యామిలీ ఫోటోలే కాకుండా ఉపాసన తన సింగిల్ ఫోటోలను కూడా షేర్ చేయడం విశేషం. ప్యారిస్ అంటేనే ఫ్యాషన్ కు రాజధాని. అందుకే ఆ నగరానికి తగ్గట్టే ఉపాసన మెగా స్టైలిష్ గెటప్ లో కనిపించారు. మెగా వదినమ్మ స్టైల్ చూస్తుంటే.. చరణ్ కు స్టైల్ విషయంలో సరైన పోటీ ఇస్తోందనిపిస్తోంది. లాభం లేదు.. చరణ్ అన్నయ్య కూడా స్టైల్ ఇంకాస్త పెంచాల్సిందే!
Please Read Disclaimer