స్విస్ బ్యాంక్ దోచుకొంటున్న ఉపేంద్ర

0upendraఉపేంద్ర సినిమాల‌న్నీ వెరైటీగా ఉంటాయ్‌. టైటిళ్లు ఫ‌న్నీగా పెడుతుంటారు. ఓసారైతే త‌న సినిమాకి పేరే పెట్టలేదు.

ఈసారీ వెరైటీ టైటిల్ తో ఆక‌ట్టుకోబోతున్నాడు. అదే స్విస్ బ్యాంక్‌కి దారేది. వింటుంటే అత్తారింటికి దారేది టైటిల్‌కి పేర‌డీగా ఉంది క‌దూ. ఉపేంద్ర న‌టించిన క‌న్నడ చిత్రం టోపీవాలా. రాజ‌కీయాల నేప‌థ్యంలో వ్యంగ్యంగా సాగే క‌థ ఇది. భావ‌న క‌థానాయిక‌గా న‌టించింది. శ్రీ‌నివాస‌న్ ద‌ర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో స్విస్ బ్యాంక్‌కి దారేది పేరుతో విడుద‌ల చేస్తున్నారు.

ఉపేంద్రకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందులోనూ కాస్త ఆక‌ట్టుకొనే టైటిల్ పెట్టాడు. మ‌రి క‌లెక్షన్లు కొల్ల‌గొడ‌తాడో లేడో చూడాలి.

Tags : స్విస్ బ్యాంక్ దోచుకొంటున్న ఉపేంద్ర, upendra, topiwala, swiss bank ki daredi,