ఐటమ్ సాంగ్ లో ఊర్మిళ ఆంటీ..!

0Urmila-Matondkarరంగేళి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హాట్ బ్యూటి ఊర్మిళ మతోండ్కర్. నార్త్ తో పాటు సౌత్ లోనూ ఆకట్టుకున్న ఈ బ్యూటి 2008 రిలీజ్ అయిన కర్జ్ సినిమా తరువాత సినీ రంగానికి దూరమైంది. అడపాదడపా టీవీ షోలతో పాటు మరాఠి సినిమాల్లో అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటి, త్వరలో ఓ బాలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

అయితే సీనియర్ హీరోయిన్లందరూ తల్లి పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తుంటే ఊర్మిళ మాత్రం స్పెషల్ సాంగ్ తో రానుంది. 43 ఏళ్ల ఈ బ్యూటీ ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రైతా సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది. అభినయ్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.