ఫోటో షూట్ లో పట్టు తప్పిన బాలీవుడ్ నటి!

0చేతికొచ్చిన సెల్ ఫోన్ పుణ్యమా అని సమాచార రంగంలో వచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. గతంలో సమాచారం కోసం ఇంటికో.. ఆఫీసుకో.. మరెక్కడికైనా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. హస్త భూషణంగా మారిన సెల్ ఫోన్ పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. క్షణాల్లో చేతికి అందే పరిస్థితి.

దీనికి తోడు సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు.. ప్రముఖులకు సంబంధించిన ఏ విషయమైనా నిమిషాల్లో తెలిసిపోయే పరిస్థితి. ఫోన్ కు ఉండే కెమేరాతో.. తమ చుట్టూ ఉన్న ప్రతి అంశాన్ని బంధించే సౌకర్యం.. సౌలభ్యం చేతికి వచ్చేసింది. దీంతో.. ప్రముఖులకు సంబంధించిన ఆసక్తికర అంశాలు ఇప్పుడు క్యాప్చర్ అవుతున్నాయి.

తాజాగా బాలీవుడ్ నటి.. హేట్ స్టోరీ 4 హీరోయిన్ ఊర్వశి రొతెలాకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ముద్దుముద్దుగా ఉంటే ఈ మత్తెక్కించే భామ..తాజాగా ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నారు. హీల్ వేసుకొని.. ఎత్తుగా ఉన్న చిన్న ఫ్లాట్ ఫాం మీద ఆమె ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు.

ఉత్సాహంగా కెమేరాలకు ఫోజులిచ్చే క్రమంలో ఆమె పట్టుతప్పారు. క్షణాల్లో ఆమె తనను తాను నియంత్రించుకున్నారు. లేకుంటే పెద్ద దెబ్బలే తగిలేవి. తనను తాను బ్యాలెన్స్ చేసుకున్నప్పటికి.. నడుముకు పెట్టుకున్న బెల్ట్ మాత్రం ఊడి కిందకు పడింది. ఇబ్బందికర పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె.. చికాకు పడకుండా చిరునవ్వులు చిందిస్తూ.. ఇష్యూను లైట్ తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.