హేట్ స్టోరీలో గ్రాండ్ మస్తీ భామ

0


urvashi-rautela-bikiniబాలీవుడ్ లో అడల్ట్ మూవీస్ కి కొదువేమీ లేదు. హీరోయిన్ల అందాలకు.. హారర్ నో కామెడీనో మిక్స్ చేసి చాలానే సినిమాలు వస్తుంటాయి. వీటిలో హేట్ స్టోరీ సిరీస్ కూడా ఉంటుంది. ఇప్పటివరకూ వచ్చిన హేట్ స్టోరీ మూడు భాగాలు మంచి విజయాన్ని నమోదు చేసుకోగా.. ఇప్పుడు హేట్ స్టోరీ4ను రెడీ చేసేస్తున్నారు.

హేట్ స్టోరీ 4వ భాగంలో లీడ్ హీరోయిన్ గా ఊర్వశి రౌతేలాను ఖాయం చేసినట్లు తెలుస్తోంది. మస్తీ సిరీస్ లో భాగంగా గతేడాది గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్ర పోషించింది. రిలీజ్ డేట్ కి 15 రోజుల ముందే లీక్ కావడంతో.. ఈ మూవీ భారీగా నష్టాలను మూట కట్టుకుంది. అయితే.. ఊర్వశి పెర్ఫామెన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. రీసెంట్ గా హృతిక్ రోషన్ మూవీ కాబిల్ లో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఈ భామకు.. హేట్ స్టోరీ4 కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సైన్ చేసేసిందట కూడా.

మొదటి మూడు భాగాలతో పోల్చితే హేట్ స్టోరీ4లో మరింతగా అందాలు కనిపించనున్నాయని టాక్. అలాగే రిలేషన్స్ విషయంలో కూడా కొత్తగా చూపించబోతున్నారని అంటున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈ సినిమా అయినా సక్సెస్ అయితే.. ఊర్వశికి ఆశించిన బ్రేక్ వస్తుంది.