చెర్రీ సినిమాకి రీసౌండింగ్ రైట్స్

0రంగస్థలం మూవీతో మెగా పవర్ స్టార్ మార్కెట్ స్టామినా ఏంటనే విషయం బాక్సాఫీస్ కి బాగానే తెలిసొచ్చింది. ఇప్పటికే 126 కోట్లకు పైగా షేర్ ను థియేటర్ల నుంచి రాబట్టడం.. అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసిన తర్వాత కూడా నెల రోజుల పాటు థియేటర్ల నుంచి షేర్ వసూలు చేయడం.. సాధారణమైన ఫీట్ కాదు.

అందుకే చెర్రీ మరుసటి మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. బోయపాటి శ్రీనుతో రాంచరణ్ మూవీ అనుకున్నపుడు చరణ్ సినిమాపై ఈ స్థాయిలో అంచనాలు లేవు. అందుకే వీటిని అందుకునే విధంగా బడ్జెట్ తో పాటు స్క్రిప్టులోను కొన్ని కీలక మార్పుచేర్పులను చేసుకున్నాడు దర్శకుడు. వచ్చే నెలాఖరుకు ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుండగా.. సంక్రాంతికి రిలీజ్ అనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించేశారు. ఇప్పుడు సినిమాకు బిజినెస్ డీల్స్ కూడా పూర్తి అయిపోతున్నాయి.

ఏపీ-తెలంగాణ రైట్స్ ను యూవీ క్రియేషన్స్ కొనుగోలు చేసేసిందని టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న మాటల ప్రకారం ఈ డీల్ విలువ ఏకంగా 72 కోట్లు అంటున్నారు. రంగస్థలం వసూలు చేసిన ఫిగర్స్ తో పోల్చితే ఇది తక్కువే కావడంతో.. మూవీని రీజనబుల్ ప్రైస్ కే అమ్మారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకే ఇంత రేటు దక్కడంతో.. చరణ్ మూవీ థియేట్రికల్ రైట్స్ రూపంలో ప్రీ రిలీజ్ బిజినెస్ ను 100 కోట్లకు పైగానే చేయనుందనే సంగతి అర్ధమవుతోంది.