యూవీ చేతికి ‘శైలజారెడ్డి అల్లుడు.’

0నాగచైతన్య హీరోగా రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. మరో రెండు రోజుల్లోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సమాయత్తమవుతోంది. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మూవీ రషెస్ చూసి యూవీ క్రియేషన్స్ వారు లేటెస్ట్ గా మూవీ కృష్ణ  – గుంటూరు హక్కులు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఒక్కో ఏరియాకు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు.. ఆంధ్రా ఏరియాకు దాదాపు 9 నుంచి 10 కోట్లకు ఈ మూవీని విక్రయించగా.. అందులోనే కృష్ణ – గుంటూరు హక్కులను యూవీకి ఇచ్చినట్టు సమాచారం.

యూవీ క్రియేషన్స్ సినిమాల నిర్మాణంతోపాటు ఈ మధ్యనే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా దిగింది. గుంటూరు జిల్లా నుంచి మెల్లగా సీడెడ్ – మిగిలిన ఏరియాలకు విస్తరిస్తోంది. తాజాగా నైజాం ఏరియాలోకి ఇటీవలే విడుదలైన రంగస్థలం సినిమా హక్కులు కొని ప్రవేశించింది. అలాగే రాంచరణ్-బోయపాటి సినిమా మొత్తం తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ‘శైలాజారెడ్డి అల్లుడు ’ మూవీ హక్కులను కూడా తాజాగా పొందింది. యూవీ క్రియేషన్స్ తో డైరెక్టర్ మారుతికి సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే వారు అడగగానే హక్కులు ఇచ్చినట్టు సమాచారం. ఈ మూవీ ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.