ముందు కెసిఆర్ సత్తా తెలుసుకోవాలి

0”ఏడు దశాబ్దాలుగా విన్నకథలనే వింటూ ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. రెండుపార్టీలు మార్చిమార్చి దేశాన్ని పరిపాలిస్తున్నా పథకాల పేర్ల మార్పు తప్ప ప్రజలకు, రైతులకు ఒరిగిందేమీలలేదు” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు కౌంటర్ ఇచ్చారు. . కేసీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించిన వీహెచ్, కేసీఆర్ మూడో ఫ్రంట్ పెడితే వచ్చేవాళ్లెవరున్నారని ప్రశ్నించారు. ఒకవేళ మూడో ఫ్రంట్ కనుక ఏర్పాటు చేస్తే ఆ ఫ్రంట్ లో కేసీఆర్ ఒక్కరే మిగిలిపోతారని, ఎంఐఎం సంతోషం కోసమే బీజేపీకి కేసీఆర్ దూరమవుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 16 సీట్లు కూడా రావని జోస్యం చెప్పిన ఆయన, రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ సత్తా ఏంటో తెలుసుకోవాలని, ఆ తర్వాతే దేశ రాజకీయాలపై మాట్లాడాలని సూచించారు