వక్కంతం వంశీకి ఆ హీరో ఛాన్స్ .?

0అద్భుతమైన రచయితలుగా పేరు తెచ్చుకొని ఆ తర్వాత దర్శకులుగా మారారు త్రివిక్రమ్ కొరటాల శివలు. ఇప్పుడు వీరు తెలుగు లో టాప్ దర్శకులుగా వెలుగొందుతున్నారు.. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇటీవలే స్టార్ రచయిత వక్కంతం వంశీ కూడా మెగా ఫోన్ పట్టారు. బన్నీని హీరోగా పెట్టి ‘నా పేరు సూర్య’ సినిమా తీశాడు. రచయితగా బంపర్ హిట్స్ ఇచ్చిన వక్కంతం తన తొలి సినిమాతో మాత్రం నిరాశపరిచారు. సరైన విజయం దక్కించుకోలేకపోయారు.

అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక నష్టాలు తెచ్చిన సినిమాగా ‘నా పేరు సూర్య’ నిలిచింది. దీంతో వక్కంతం తో ఇప్పుడు రెండో సినిమా చేయడానికి ఏ హీరో ముందుకు రావడం లేదు. నా పేరు సూర్యకు ముందు రెండు మూడు పెద్ద కమిట్ మెంట్లు ఉన్నట్లు వక్కతం చెప్పాడు. కానీ తొలి సినిమా ఫ్లాప్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నా పేరు సూర్య తర్వాత వక్కంతం నెక్ట్స్ సినిమాను ప్రకటించింది లేదు. ముందు హామీ ఇచ్చిన ఒకరిద్దరు హీరోలు కూడా వెనక్కి తగ్గినట్లు ఫిలింనగర్ సమాచారం.

వక్కంతంను అందరూ దూరం పెడుతున్నా మాస్ మహారాజ్ మాత్రం ఎంతోె నమ్మి ఇతడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట.. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ‘కిక్’ సినిమాకు కథను అందించింది వక్కంతమే.. అందుకే అతడి టాలెంట్ నమ్మి రవితేజ సినిమా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. మరి ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న వీరిద్దరూ కలిసి ఎలాంటి అద్భుతం సృష్టిస్తారనేది చూడాలి మరి.