వానపాటల సుందరికి 40 లక్షలా?

0Vani-Vishwanathబోయపాటి శ్రీను సినిమాలంటే ఫుల్ యాక్షన్ ఎంటర్ టెయినర్లు. అందులోనూ గ్లామర్ డోస్ బాగా ఉండేట్టు చూసుకుంటాడు. అందుకే అతడి సినిమాలు రిచ్ లుక్ తో ఉంటాయి. సరైనోడు హిట్ తర్వాత బోయపాటి శ్రీను రెట్టించిన ఉత్సాహంతో జయ జానకి నాయక సినిమా తీశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. మూవీకి సంబంధించి ప్రమోషన్ల విషయంలోనూ ఏ మాత్రం తగ్గడం లేదు.

బోయపాటి ముందు సినిమాల కన్నా జయ జానకి నాయకలో గ్లామర్ డోస్ మరింత పెంచాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. బోయపాటి మాత్రం తన లెక్క ప్రకారం ఈ సినిమాలో ఇంకో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని అంటున్నారు. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ సెకండ్ హీరోయిన్. ప్రేక్షకులను మరింత మురిపించడానికి క్యాథరిన్ థ్రెస్ ఐటం సాంగు ఉంది. వీళ్లతోపాటు ఒకప్పటి హీరోయిన్ -వాన పాటల సుందరి వాణీ విశ్వనాథ్ స్పెషల్ రోల్ చేసింది. ఈ సినిమాలో ఆమె కనిపించేది నాలుగే సీన్లలో. కానీ అందుకోసం ఆమెకు రూ. 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. సినిమాలో ఈ రోల్ చాలా ఇంపార్టెంట్ అయినందువల్లే హీరోయిన్లతో సమానంగా రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను తీసుకున్నామని బోయపాటి అంటున్నాడు. వీళ్లతోపాటు ధన్య బాలకృష్ణ రోల్ కూడా కీలకంగా ఉంటుందని చెబుతున్నాడు.

జయ జానకి నాయక ముందునుంచి చెబుతున్నట్టుగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. బోయపాటి మాటలను బట్టి క్యాస్టింగ్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ కు మించి ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా అంచనాలను మించి హిట్ అయితేనే పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం కష్టం. చూద్దాం.. ఈ సినిమా ఎంతవరకు డబ్బులు రాబడుతుందో?