వర్మను దిమ్మతిరిగేలా చేసిన రజనీ

0 

భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సైన్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘2.ఓ’. రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘2.ఓ’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు విడుదలకు ముందే లీకై చిత్రబృందాన్ని నిరాశపరిచింది. టీజర్‌ విడుదలకు ముందే కొన్ని సన్నివేశాలు లీకవడం బాధాకరం. దీనిపై ఇప్పటికే రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా టీజర్‌ లీక్‌పై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. ‘ఏదో కారణం చేత ‘2.ఓ’ టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు లీకయ్యాయి. అయినప్పటికీ ఆ సన్నివేశాలు దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి’ అని తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు వర్మ.

శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్‌ నటించారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం. ఆగస్ట్ లో ఈ సినిమా రిలీజ్ చేయడనికి సన్నాహాలు చేస్తున్నారు.