హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్!

0Varalakshmi-GOt-Kidnappedఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా.. #VaralaxmiGotKidnapped అంటూ తమిళ హీరోయిన్ వరలక్ష్మి (శరత్ కుమార్ కూతురు) బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో కలసి కనిపిస్తోంది. నోటికి ఖర్చీఫ్ కట్టేసి.. ఎక్కడో మంచం మీద పడేసి.. అప్పుడు ఆమెను ఒక చీప్ సెల్ ఫోన్ కెమెరాలో ఫోటో తీసి.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే వరలక్ష్మి నిజంగానే కిడ్నాప్ అయ్యిందా? పోలీసులు ఏం చేస్తున్నట్లు? అసలు ఇటువంటి ఫోటోలు బయటకు ఎలా వస్తాయి? తదితర డౌట్లు జనాలకు వచ్చేస్తున్నాయి.

కాని నిజానికి మలయాళ హీరోయిన్ భావన పై లైంగికంగా ఆమె కారులోనే ఎటాక్ జరిగినప్పుడు.. వరలక్ష్మి తనను ఫిలిం ఇండస్ట్రీ లో కొందరు బెడ్ రూమ్ కు రమ్మన్నారని.. ఒక మీడియా సంస్థ హెడ్ కూడా కోర్కెలు తీర్చమన్నాడని చెప్పింది. అదే సమయంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టాలంటూ ఆమె ”సేవ్ శక్తి” పేరుతో ఒక క్యాంపెయిన్ కూడా మొదలెట్టింది. ఇప్పుడు ఆ క్యాంపెయిన్ లో భాగంగానే ఇలా వరలక్ష్మి కిడ్నాప్ అయ్యిందంటూ ఆసక్తి రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు తమిళ జనాలు. అయితే ఇందులో ఆసక్తి కంటే కూడా జనాలను భయభ్రాంతులకు గురిచెయ్యడం ఎక్కువగా కనిపిస్తోంది కదూ.