లవర్ ను ఆపలేకపోయిన విశాల్

0ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో విశాల్ హవా బాగానే సాగుతోంది. నడిగర్ సంఘం తరఫున విశాల్ చెబుతున్న మాటలకు అందరూ వాల్యూ ఇస్తున్నారు. రీసెంట్ గా సినిమాల సమ్మె విషయంలో థియేటర్లకు మేలు జరిగేలా విశాల్ మధ్యవర్తిత్వం చేసిన తీరు.. అతనిపై అందరికీ నమ్మకం.. గౌరవం పెరిగేలా చేసింది.

దీంతో తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డుల విషయంలో విశాల్ మాట బాగానే నెగ్గింది. తమ సంఘానికి విరాళం ఇవ్వాలంటూ ఫిలింఫేర్ వర్గాలను అడిగితే.. వారు నిరాకరించడంతో.. ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చాడు విశాల్. దీంతో బెస్ట్ యాక్ట్రెస్ వచ్చిన నయనతార నుంచి కార్తి సహా పలువురు తారలు ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు. కానీ ఆశ్చర్యకరంగా విశాల్ కు ప్రియురాలు అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ మాత్రం ఎంచక్కా ఫిలింఫేర్ కార్యక్రమానికి అటెండ్ అయింది.

అంతే కాదు.. తను ఎలా ఆ ఈవెంట్ కు అటెండ్ అయిందో.. చీరకట్టు సొగసులు ఎంత బాగున్నాయో ఆయా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఇంత మంది స్టార్స్ ను ఆపగలిగిన విశాల్.. తన లవర్ ను మాత్రం ఆపలేకపోవడం ఆశ్చర్యపోయే విషయమే. అయితే.. ఇటు ప్రియుడు వద్దనే వారించి ఉంటాడు కానీ.. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ మాత్రం ప్రోత్సహించి ఉంటాడని.. అందుకే ఇలా వరు ఫిలిం ఫేర్ ఈవెంట్ కు అటెండ్ అయిఉంటుందని జోకులు వేస్తున్నారు తమిళ జనాలు.