నిర్మాత పై హీరోయిన్ విమర్శలు

0Varalakshmi-Sarathkumarశరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కొత్త సినిమా రీసెంట్ గా ప్రారంభమైంది. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన అప్పా చిత్రాన్ని మలయాళంలో ఆకాశ మిట్టాయ్ అనే పేరుతో రీమేక్ చేయాలని నిర్ణయించగా.. మూడు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఆకాశ మిట్టాయ్ ఓపెనింగ్ లో కూడా వరలక్ష్మి పాల్గొంది.

జయరాం హీరోగా నటించనున్న ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పేసింది. ఓపెనింగ్ పాల్గొన్న భామ.. రెండే రోజుల్లో తప్పుకుంటున్నట్లు చెప్పడంతో.. అంతలోనే ఏమైందో అనున్నారంతా. దీనిపై ఇప్పుడు ఈ హీరోయిన్ స్పందించింది. గతంలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. పురుషాధిక్యత వంటి వ్యవహారాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈమె.. ఇప్పుడు ఆకాశ మిట్టాయ్ నిర్మాతలపై ఫైర్ అయింది. ఆ నిర్మాతలతో పని చేయడం ఇష్టం లేకే.. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని ఓపెన్ గా చెప్పేసింది వరలక్ష్మి.

‘నేను ఆకాశ మిట్టాయ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను. ఆ నిర్మాతలతో పని చేయడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సభ్యత.. సంస్కారం లేని నిర్మాతలతో పని చేయడం చాలా కష్టం. నా డెసిషన్ అర్ధం చేసుకున్న దర్శకుడు సముద్ర గని.. హీరో జయారంలకు కృతజ్ఞతలు. వారితో ఫ్యూచర్ లో తప్పకుండా పని చేస్తా’ అని చెప్పింది వరలక్ష్మి. ఈ హీరోయిన్ అంతగా తిట్టిపోసిన ఆ నిర్మాత పేరు మహా సుబేర్.